Saturday, April 27, 2024
- Advertisement -

‘చెలియా’ మూవీ రివ్యూ

- Advertisement -
Cheliya Movie Review

ఓకే బంగారం సినిమా తర్వాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నుంచి వచ్చిన మరో రొమాంటిక్ మూవీ చెలియా. మణి మార్క్ టేకింగ్ తో పాటు ఏ ఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతంతో.. మాస్ హీరోగా ఇమేజ్ ఉన్న కార్తీకి ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అయిందో… సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ : 

వరుణ్ అలియాస్ వీసీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో స్వాడ్రన్ లీడర్. ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడిన వరుణ్‌ను అధికారులు హాస్పిటల్‌‌లో చేర్చుతారు. అక్కడ డ్యూటీ డాక్టర్‌గా అప్పుడే విధుల్లో చేరిన లీలా అబ్రహం ఆయనకు చికిత్స అందిస్తుంది. ఆ సమయంలో లీలాను చూసి ఇష్టపడుతాడు. ఆ తర్వాత మారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. తమ ప్రేమలో కలతలు, కలహాలు చోటుచేసుకొంటాయి. ఈ సందర్భంలో వారిద్దరూ విడిపోతారు. అదే సమయంలో యుద్ధం చోటుచేసుకోవడంతో ఫైటర్ పైలట్‌గా తన కర్తవ్యాన్ని నిర్వహించేందుకు కార్గిల్‌కు వెళుతాడు. యుద్ధంలో విమానం కూలి పాకిస్థాన్ సైన్యానికి బందీగా చిక్కుతాడు. రావల్పిండి జైలులో వరుణ్ తన ప్రేమికురాలు లీలా అబ్రహం గురించి తలుచుకొంటూ బతుకుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వరుణ్ పాకిస్థాన్ జైలు నుంచి బయటపడ్డాడా? తన ప్రేమికురాలు లీలాను కలుసుకొన్నాడా? చివరికి కథకు ముగింపు ఏంటనే ప్రశ్నలకు సమాధానమే చెలియా చిత్రం.

ప్లస్ పాయింట్స్ :

మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూ.. వస్తున్న కార్తీ… ఈ సారి మణిరత్నం తో చేసిన ఈ సినిమాలో పూర్తి పర్ఫామెన్స్ ఓరియంటెడ్ పాత్రలో కనిపించాడు. ఆర్మీ ఆఫీసర్ లో ఉండే ఆవేశం, అదే టైంలో తను ప్రేమించిన అమ్మాయి కోసం పడే తపన ఇలా రెండు భావాలను గొప్పగా పలికించాడు. హీరోయిన్ గా నటించిన అదితి రావ్ హైదరీ తన అందంతోనే సగం మార్కులు కొట్టేసింది. నటిగానూ అద్భుతంగా చేసింది. రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ చాలా బాగా చేసింది. ఎస్ రవివర్మన్ సినిమాటోగ్రఫి గురించి ఎంత చెప్పిన తక్కువే. రెహమాన్ అందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్యం సంగీతంతో మాత్రం మరోసారి మ్యాజిక్ చేశాడు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తంగా కార్తీ నటన, అదితిరావ్ హైదరీ అందం, సినిమాటోగ్రఫి, లొకేషన్స్ సూపర్బ్.

మైనస్ పాయింట్స్ :

కార్తీని ఫైటర్ పైలట్ గా చూపించిన మణిరత్నం దేశభక్తికి సంబంధించిన సన్నివేశాలపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా పాక్ ఆర్మీ చేతుల్లో ఉన్న ఓ భారత ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఈజీగా తప్పించుకొని తిరిగి భారత వచ్చేయటం అంత నమ్మశక్యంగా అనిపించదు. అదే సమయంలో మణి మార్క్ స్లో నారేషన్  కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. కొన్ని సీన్స్ ఇబ్బందిగా అనిపించాయి. రొటీన్ స్క్రీన్ ప్లే పెద్ద మైనస్.

మొత్తంగా :

కార్తీ నటన, అదితిరావ్ హైదరీ అందం, నిమాటోగ్రఫి ప్రధాన బలంగా కనిపించగా.. స్లో నారేషన్, రొటీన్ స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్ గా కనిపించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. మణిరత్నం సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -