ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ తొందరపడి పెళ్లిలు చేసుకోవడం ఆ తర్వాత విడాకులు తీసుకోవడం.. ఆ తర్వాత మీము తప్పు చేశామని చెప్పుకోవడం బాగా మాములు అయిపోయింది. ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించిన రంభ, తన భర్త తో విడాకులు తీసుకోని… బయటకు మాత్రం.. మా వారు మంచి వారు..
మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది కేవలం మా పిల్లలమీద అమితమైన అభిమానంతోనే.. విదేశాల్లో చదివించాలని మా ఆయన.. లేదు, స్వదేశంలో చదివించాలని నేను.. ఇద్దరం అభిప్రాయబేధాల్ని పెంచుకున్నాం.. ఇకపై ఆ గొడవలు వుండవు..” అంటూ చెప్పి , తన భర్త నుంచి తనకు ప్రతినెలా ఖర్చుల నిమిత్తం కొంత సొమ్ముని న్యాయస్థానం ఇప్పిస్తే చాలు అని వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. తాజా మరో టాప్ హీరోయిన్ అమలా పాల్ కూడా రంభనే ఫాలో అవుతుంది.
రిసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో అమలా మాట్లాడుతూ.. తన భర్త విజయ్ చాలా మంచోడనీ, చిన్న వయసులో పెళ్ళి చేసేసుకోవడం వల్ల తానే మెచ్యూరిటీ లేక ఆయనతో విడిపోయినట్లు ” చెప్పుకొచ్చింది. ఇక ఈమె మాటలు విన్న వారు మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న క్రమం లోనే విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుందని , సినిమాల్లో తిరిగి నటించాలని అమలాపాల్ అనుకోవడం, దానికి భర్త విజయ్ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో, వైవాహిక జీవితం కన్నా సినిమా కెరీర్ ముఖ్యమని ఆమె భావించడం.. వెరసి, భర్తకు దూరమయ్యింది..ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుంది మరి ముందు ముందు రోజుల్లో రంభ మాదిరి ఖర్చుల నిమిత్తం విజయ్ ను డబ్బు అడుగుతుందో ఏమో..అని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.
Related