Wednesday, May 8, 2024
- Advertisement -

ఆ మాట అంటే అనసూయకు పరమ అసహ్యం!

- Advertisement -
Anasuya Hates Item Song Word

యాంకర్ అనసూయ.. ఐటెం సాంగ్.. అనే మాటెత్తితే చాలు మండిపోతోంది. అసలు ఐటెం అనే మాటనే తనకు అసహ్యం అని అంటుంది ఈ భామ. ఇకపై అందరూ ఐటెం సాంగ్స్ ను స్పెషల్ సాంగ్స్ అనాలని గట్టిగా చెపుతోంది. నిజానికి తనకి స్పెషల్ సాంగ్స్ మీద ఆసక్తి లేదని.. ఐతే ‘విన్నర్’ సినిమాలో చేసిన పాట చాలా స్పెషల్ కాబట్టే అందులో చేసానని అంటుంది అనసూయ. అయితే ఈ స్పెషల్ సాంగ్స్ మీద అనసూయ ఫీలింగ్ ఏంటంటే.. ” ఐటెం సాంగ్స్ అనే పదమంటేనే అసహ్యం.

మేం నటులం తప్ప.. వస్తువులం కాదు. సో ‘ఐటెం’ అనే మాట ఎందుకు వాడుతారు. అసలు ఇది బాలీవుడ్ నుంచి వచ్చింది. స్పెషల్ స్టార్స్ చేస్తారు కాబట్టి వీటిని స్పెషల్ సాంగ్స్ అనాలి తప్ప ఐటెం సాంగ్స్ అనకూడదు. నాకు నిజానికి ఈ తరహా స్పెషల్ సాంగ్స్ చేసే ఉద్దేశం లేదు. ఇంతకుముందు ఇలాంటి ఆఫర్లు వస్తే అంగీకరించలేదు. ఐతే విన్నర్ మేకర్స్ నన్ను సంప్రదించినపుడు ముందు లిరిక్స్ వినమన్నారు. ఆ పాట అంతా నా పేరు మీదే సాగుతుంది. చాలా సరదాగా ఉంటుంది.

లిరిక్స్ అంతా విన్నాకే ఈ పాట చేయడానికి ఒప్పుకున్నా. ‘క్షణం’ తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చినా కూడా అంగీకరించలేదు. ఈ పాటకు స్టెప్పులేస్తున్నపుడు అది సుమగారు పాడారని తెలియదు. షూట్ చేసేటపుడు డమ్మీ సాంగ్ ప్లే చేశారు. కానీ తర్వాత సుమగారే ఫోన్ చేసి తాను ఈ పాట పాడానని చెప్పి సర్ప్రైజ్ చేశారు’’ అని అనసూయ తెలిపింది.

Related

  1. స్పెషల్ సాంగ్ కి అనసూయ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
  2. అనసూయ కోసం సుమ ఏం చేసిందో తెలుసా..?
  3. శాతకర్ణి సినిమాలో అనసూయ పాత్ర ఇదే!
  4. మరో సారి తన లుక్స్ తో రెచ్చగొడుతున్న అనసూయ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -