అనసూయకు అదిరిపోయే చాన్స్‌.. ఏకంగా మెగాస్టార్‌తోనే..

- Advertisement -

యాంకర్ అనసూయ ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. ఒకవైపు టీవీ షోలు మరోవైపు వరుస సినిమాలను సమానంగా బాలన్స్ చేస్తోంది. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న అన‌సూయ‌.. క్ష‌ణం సినిమాతో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత రంగ‌స్థ‌లంలో రంగమ్మత్తగా నటించి అందరి మన్ననలు పొందింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ థ్యాంక్ యూ బ్రదర్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా కమిట్ అయింది.

ఇప్పటి వరకు తెలుగులో మాత్రమే సత్తా చూపించిన అనసూయ ఇప్పుడు తమిళ, మలయాళ ఇండస్ట్రీలకు కూడా వెళ్తుంది. ఇటీవల విజయ్ సేతుపతి హీరోగా నటించే ఓ తమిళ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పి, కోలీవుడ్ ప్రవేశం కూడా చేసిన ఈ బ్యూటీకి మలయాళం నుంచి అదిరిపోయే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. అక్కడ మెగాస్టార్ మమ్మట్టి సినిమాలో అనసూయను కీలక పాత్ర కోసం అడిగినట్లు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

కథ నచ్చడం.. మలుపు తిప్పే పాత్ర కావడంతో అనసూయ కూడా ఓకే అనేసిందని తెలుస్తుంది. అంతేకాదు.. గతంలో యాత్ర సినిమాలో కలిసి నటించారు మమ్ముట్టి, అనసూయ. ఆ పరిచయంతోనే ఇప్పుడు మమ్ముట్టితో నటించడానికి ఒప్పుకుంది అనసూయ. తెలుగులో యాంకర్‌గా, నటిగా దూసుకెళ్తున్న అనసూయ మరి మలయాళంలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి.

ఎస్ఈసీ ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే!

ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తిండిపోయేలా బ్రతికేద్దాం

నా అందాన్ని అలా ఉపయోగించాలంటూ షాకింగ్‌ కామెంట్

వేశ్య పాత్రల్లో అద్భుత నటన

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...