Saturday, April 20, 2024
- Advertisement -

గాంధీ ఆసుపత్రి పారిశుద్ధ్యకార్మికుడికి తొలి టీకా!

- Advertisement -

దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుండగా, తెలంగాణలో తొలి టీకాను ఓ పారిశుద్ధ్య కార్మికుడికి వేయనున్నారు. గత ఏడాది మొత్తం కరోనా వ్యాక్సిన్ తయారు చేడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. మొత్తానికి ఈ ఏడాది టీకా మార్కెట్ లోకి వచ్చింది. నగరంలోని గాంధీ హాస్పిటల్‌ నుంచే కరోనా టీకా పంపిణీ ప్రారంభం కానుంది.

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఈనెల 16న టీకా పంపిణీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రధాని ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించనున్నారు. నేటి సాయంత్రానికి యాప్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. టీకా పంపిణీ తర్వాత కూడా సమస్యలు ఎదురైతే ఆఫ్‌లైన్‌లోనే సమాచారాన్ని పొందుపరచాలని సూచించారు.

లబ్ధిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే 104 నంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని కోరారు. ఇక హైదరాబాద్‌లోని గాంధీ దవాఖాన, రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగి పీహెచ్‌సీ సెంటర్లకు చెందిన వైద్యాధికారులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -