Friday, April 19, 2024
- Advertisement -

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌కు మ‌రోసారి చుక్కెదురు!

- Advertisement -

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్కు హైకోర్టులో మ‌రోసారి చుక్కెదురైంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ అమలుపై స్టే విధిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్ కోర్టుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం విచార‌ణ చేసిన డివిజ‌న్ బెంచ్ ఎస్ఈసీ అభ్యంత‌రాల‌ను తోసిపుచ్చింది. అత్యవసరంగా ఈ అంశంపై విచారణ జరపాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.

ఈ పిటిష‌న్‌పై విచారణను 18వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. జస్టిస్‌ దుర్గాప్రసాదరావు, జస్టిస్ కృష్ణమోహన్‌ల ధ‌ర్మాస‌నం ఈ మేర‌కు వ్యాఖ్య‌లు చేసింది. కాగా క‌రోనా భ‌యాల నేప‌థ్యంలో గ్రామ పంచాయ‌తి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ సాధ్యం కాద‌ని ఏపీ ప్ర‌భుత్వం చెప్పిన‌ప్ప‌టికీ, ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఏక‌ప‌క్షంగా ఈనెల 8న ఎన్నిక‌ల షెడ్యూల్ నోటిఫికేష‌న్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌భుత్వం హైకోర్టుకు వెళ్లింది.

ఈ క్ర‌మంలో.. ప్ర‌భుత్వ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సింగిల్ బెంచ్‌‌.. ఎన్నికల షెడ్యూల్‌ అమలును నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్న‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ ఆదేశాల‌ను స‌వాలు చేస్తూ ఎస్ఈసీ హౌజ్‌మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా డివిజ‌న్ బెంచ్ ఈ మేర‌కు.. విచార‌ణ‌ను వ‌చ్చే సోమ‌వారానికి వాయిదా వేసింది.

అట్టెట్టా.. అచ్చెన్నాయుడు!

విజయశాంతి నటించిన టాఫ్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు..!

ఆసీస్‌కు దిమ్మ‌తిరిగి పోయిందిగా!

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -