అంచనాలు పెంచేస్తోన్న ‘ఉప్పెన’ టీజర్.

- Advertisement -

మెగా మేనల్లుడు, సాయి తేజ్‌ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ఉప్పెన. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. భోగి పండగ సందర్భంగా ఈ సినిమా టీజర్ ను బుధవారం విడుదల చేసారు.

‘దేవుడే వరాలిస్తాడ‌ని నాక‌ర్థ‌మయింది. ఎవ‌రికి పుట్టామో అంద‌రికీ తెలుస్తుంది.. కానీ ఎవ‌రి కోసం పుట్టానో నా చిన్న‌ప్పుడే తెలిసిపోయింది’..అంటూ హీరో వైష్ణ‌వ్‌తేజ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ మొదలవుతంది. ‘మనిద్దరి మధ్యన ప్రేమెందుకని ప్రేమనే పక్కన పెట్టేశా’అంటూ హీరోయిన్ చెప్పే డైలాగు కూడా ఆకట్టుకుంటోంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ టీజర్‌లో చాలా క్యూట్‌గా కనిపిస్తున్నారు.పేదింటి అబ్బాయి.. పెద్దింటి అమ్మాయి మధ్య సాగే ప్రేమకథే ఉప్పెన అని టీజర్‌ చూస్తే అర్థమవుతుంది.

- Advertisement -

అలాగే టీజర్‌ చివర్లో హీరో గాయాలతో సముద్రం ఒడ్డున జీవచ్చవంలా పడి ఉన్నట్లు చూపించారు. దీన్ని బట్టి హీరో సినిమా ఆఖర్లో చనిపోయినట్లు చూపిసార్తరని అనిపిస్తోంది. ‘ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తిండిపోయేలా బ్రతికేద్దాం’అని హీరోతో హీరోయిన్‌ చెప్పడాన్ని బట్టి వీళ్ల ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పరువు హత్యల నేపథ్యంలోనే ఉప్పెన సినిమా వస్తుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ చిత్రంలో త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులనూ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

సాయిపల్లవిని లేపుకెళ్తున్న చైతూ..

కమెడియన్ తో అనసూయ రొమాన్స్

టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌కు మ‌రోసారి చుక్కెదురు!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...