Monday, April 29, 2024
- Advertisement -

అంధగాడు మూవీ రివ్యూ

- Advertisement -
Andhhagadu Review

రాజ్ తరుణ్ కు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అలా వచ్చిందే అంధగాడు చిత్రం. పలు పెద్ద సినిమాలకు కథలు అందించిన వెలిగొండ శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ గా హెభా పటేల్ నటించగా.. రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్ర పోషించారు.

మరి ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

గౌతమ్‌ (రాజ్‌ తరుణ్‌) పుట్టుకతోనే అంధుడు. అనాథాగా పెరిగి రేడియో జాకీగా జాబ్ చేస్తాడు. నేత్ర (హెబ్బా పటేల్‌) పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారుతుంది. అయితే నేత్ర దగ్గర అవ్వడం ఆమె అతనికి దూరం కాకుండా ఉండటం కోసం చూపు ఉన్నట్లు నటిస్తాడు. కానీ నేత్రకు నిజం తెలిసిపోతుంది. నేత్ర డాక్టర్ కావడంతో గౌతమ్‌కి కళ్లొచ్చే ఏర్పాటు చేస్తుంది. కళ్లొచ్చాక అంతా హ్యాపీనే అనుకొంటుంటే.. అప్పటి నుంచే కొత్త సమస్యలు మొదలవుతాయి. కులకర్ణి (రాజేంద్ర ప్రసాద్‌) అనే ఓ ఆత్మ.. గౌతమ్‌ని వెంబడిస్తుంది. నిజానికి కులకర్ణి కళ్లనే.. గౌతమ్‌కి అమర్చారు. అందుకే.. ఆ ఆత్మ కేవలం గౌతమ్‌కి మాత్రమే కనిపిస్తుంటుంది. రెండు హత్యలు చేసి, తన ఆత్మకు శాంతి చేకూర్చాలని కులకర్ణి ఆత్మ.. గౌతమ్‌ని వేడుకొంటుంది. మరి గౌతమ్‌ అందుకు ఒప్పుకొన్నాడా? అసలు కులకర్ణి ఎవరు? చివరికి ఏం జరిగింది అనేది మిగిత కథ.

{loadmodule mod_custom,GA1}

ప్లస్ పాయింట్స్ :

ప్రధానంగా ఈ సినిమాలో రాజ్‌తరుణ్‌ నటన బాగుంది. కాస్తా యాక్షన్‌ డోస్‌ పెంచాడు. ఇక సినిమా మొదటి నలబై నిమిషాలు గుడ్డివాడి పాత్రలో మంచి నటన కనబర్చారు. ఫస్టాఫ్‌లో నార్మల్‌గా కనిపించే రాజ్‌తరుణ్‌ ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో కాస్తా యాక్షన్‌ హీరోలా కనపడే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా కథ మాములుగా ఉన్న దర్శకుడు నడిపించిన విధానం బాగుంది. తొలి అర్ధభాగం ఓ మోస్తరుగా నడుస్తుంది. పాత్రల పరిచయానికీ, రాజ్‌ తరుణ్‌ – హెబ్బాల ప్రేమకథకే కేటాయించాడు దర్శకుడు. సెకండ్ ఆఫ్ లో అసలు కథ మొదలు అవుతుంది. కథకు కీలకమైన ఈ భాగాన్ని దర్శకుడు నడిపించిన విధానం ఆకట్టుకొంటుంది. కామెడీ, థ్రిల్‌, సస్పెన్స్‌, హారర్‌.. ఇవన్నీ బాగానే పండించాడు. హెబ్బా పటేల్‌ తన పాత్రకు న్యాయం చేసింది. మరోసారి రాజ్‌తరుణ్‌, హెబ్బా జంట మరోసారి స్క్రీన్‌పై ఆకట్టుకుంది. ఇక కులకర్ణి పాత్రలో రాజేంద్ర ప్రసాద్‌ నటన గురించి మనం కొత్తగా చెప్పనక్కర్లేదు. పాత్రకు తగ్గటు చాలా బాగా చేశారు. మెయిన్‌విలన్‌గా చేసిన రాజా రవీందర్‌, సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో పాత్రలో ఒదిగిపోయాడు.

{loadmodule mod_custom,GA2}

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. ఇలాంటి కథలు మన తెలుగులో చాలానే చూసాం. కథలో కొత్తగా ఏమిలేకపోయిన.. కథనంతో దర్శకుడు ఆకట్టుకున్నాడు. ఇక పాటల విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. అలానే బ్యాక్ గ్రాండ్ మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ కాలేకపోయింది. మొదటి భాగంలో.. కొన్ని సీన్స్ బోరుకొడుతాయి. సెకండ్ ఆఫ్ పర్వాలేదు అనిపించిన ఫస్ట్ ఆఫ్ మీద పెద్దగ దృష్టి పెట్టలేదు.

మొత్తంగా :

వరస విజయలతో ముందుకు వెళ్తున్న రాజ్ తరుణ్ కి ఈ అంధగాడు కూడా మంచి సక్సెస్ ఇస్తోంది అని చెప్పవచ్చు. రాజ్ తరుణ్ నటన.. కథనం ప్లస్ పాయింట్స్ గా కనిపించగా.. కథ.. పాటలు మైనస్ పాయింట్స్ గా కనిపిస్తున్నాయి. దర్శకుడు మంచి ట్విస్టులుతో ఈ సినిమా నడిపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే కామెడీ.. రాజ్ తరుణ్ సినిమాలను ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతోంది.

{youtube}fGUkr2g18fo{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -