బుల్లితెరపై ప్రేక్షకులను చక్కగా అలరిస్తున్న యంగ్ యాంకర్ ప్రదీప్.. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడనే న్యూస్ సంచలనం రేపుతోంది. చెక్ బౌన్స్ కేసులో విషయంలో ఎర్రమంజిల్ కోర్టు రిమాండ్ తరలిస్తూ తీర్పు చెప్పినట్టు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రదీప్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
{loadmodule mod_custom,GA1}
అయితే పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తులు రంగంలోకి దిగి అదే బెయిల్‌పై బయటకు తీసుకురావడం జరిగిందనే తాజా సమాచారం. విషయంలోకి వెళ్తే.. ఓ వ్యక్తి వద్ద యాంకర్ ప్రదీప్ అప్పుగా తీసుకొన్న వ్యవహారం వారి మధ్య వివాదంగా మారిందని.. దాంతో ఆ వ్యక్తి ప్రదీప్‌పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో.. ప్రదీప్ పలుమార్లు కోర్టుకు హాజరయ్యారని, చెక్ బౌన్స్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు అతనికి రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. గతంలో.. తప్పతాగి క్లబ్ లో పార్టీలో ఓ అమ్మాయితో.. దురుసుగా ప్రవర్తించారనే.. వార్త వార్త కూడా మీడియాలో ప్రచారమైంది. అతిగా మద్యం సేవించిన ప్రదీప్ ఓ అమ్మాయి పై కామెంట్ చేయగా.. ఆ అమ్మాయి ప్రెండ్స్ ప్రదీప్ బృందానికి వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
{loadmodule mod_custom,GA2}
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రదీప్ బృందాన్ని బౌన్లర్లు అక్కడి నుంచి వెళ్లగొట్టినట్టు సమాచారం. ఇప్పుడు తాజాగా చెక్ బౌన్స్ వ్యవహారం ప్రదీప్ మీడియాలో ప్రధాన అంశంగా మారాడు. మంచి మెరుగైన ఆర్థిక పరిస్థితి ఉన్న ప్రదీప్ విషయంలో చెక్ బౌన్స్ వివాదం ఎలా చోటుచేసుకొన్నదనే ప్రస్తుతం చర్చగా మారింది.
{youtube}R1lahEAp7ig{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related