బుల్లి తెర యాంకర్‌గా సుమ సంచలనం సృష్టిస్తోంది. ఆమె మలయాళీ అమ్మాయి అయిన తెలుగులో చక్కగా మాట్లాడుతోంది. ఆమె తెలుగుతో పాటు తమిళ,మలయాళం, ఇంగ్లిష్ భాషలు కూడా మాట్లాడుతుంది. సుమ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక టీవీ షో అయినా.. ఒక ఆడియో వేడుకనైనా ఆమె నడిపించే తీరు అమోఘం.
సామాన్య ప్రజల నుంచి పెద్ద పెద్ద సెలబ్రెటీల వరకు అందరికి సుమ ఫెవరెట్ యాంకర్. మామూలుగానే సుమ పంచ్ లు వేస్తుంది. ఆ పంచ్ ల్లో వేరే అర్ధాలు లేకపోయినా ఇటీవల ఒక సంఘటన లో మాత్రం పప్పులో కాలు వేసింది. తాజాగా సుమ హోస్ట్ చేస్తున్న ఒక ప్రోగ్రాం కి శ్రీనివాస్ అవసరాల నటిస్తున్న బాబు బాగా బిజీ సినిమా టీం వచ్చారు. ఆ షోలో భాగంగా బాబు బాగా బిజీ హీరోయిన్ మిస్తీ చక్రవర్తితో మాట్లాడుతూ.. నీ పేరు ముష్టినా అని అడిగిందట సుమ.
ఈ దెబ్బతో అక్కడున్నవాళ్లంతా తెగ నవ్వేశారట. మొదట హీరోయిన్ అర్ధం కాకపోయిన తర్వాత పక్కనోళ్లు ఆ మాటకు అర్ధం బెగ్గింగ్ అని వివరించారు. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ కొంచెం ఫీల్ అయినా అది ఏమి ముఖంలో కనపడకుండా ప్రోగ్రాం మొత్తం చిరునవ్వుతో కంటిన్యూ చేసింది. సుమ తన తప్పు తెలుసుకొని ప్రోగ్రాం అయిపోయిన తరువాత వెంటనే మిస్తీ చక్రవర్తి సారి చెప్పిందని తెలుస్తుంది. అలాగే ఈ ముష్టి ఎపిసోడ్ ను తీసేయమని ఎడిటింగ్ కు చెప్పిందట సుమ. ఏది ఏమైనా ఈ మధ్య యాంకర్లు హద్ధు మీరుతున్న సంగతి తెలిసిందే.. ఆ లిస్ట్‌లో సుమ కూడా చేరిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Related