బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా.. ఛత్రపతి హిందీ రీమేక్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. బెల్లంకొండ సురేశ్, పెన్ స్టూడియో సంస్థలు ఈ మూవీని నిర్మించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు డైరెక్టర్గా వీవీ వినాయక్ ను ఎంపిక చేశారు. ఇక కియారా అద్వానీ హీరోయిన్గా ఎంపికయ్యిందని అప్పట్లో తెగ హడావుడి జరిగింది. కానీ ఉన్నట్టుండి ఈ మూవీ ఆగిపోయినట్టుగా పుకార్లు వచ్చాయి. అయితే ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ వేశారు కూడా. అయితే ఆ సెట్ కూలిపోయిందని చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ వివిధ కారణాల వల్ల ఈ మూవీ ఆగిపోయినట్టు సమాచారం.
తాజాగా పెన్ స్టూడియో తాము ఏయే సినిమాలు చేయబోతున్నామో ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ఛత్రపతి రీమేక్ ప్రస్తావన లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయినట్టు జరిగిన ప్రచారం నిజమేనని తేలింది. తమ సంస్థలో ఏయే సినిమాలు విడుదలవుతాయో ఆ సంస్థ జాబితాను విడుదల చేసింది. అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’, ఆలియా భట్ ‘గంగూబాయ్’, జాన్ అబ్రహం ‘ఎటాక్’, రామ్‌చరణ్- ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’, రణ్‌వీర్ సింగ్ ‘అన్నియన్’ రీమేక్ ఉన్నాయి.
Also Read: విజయ్ కొత్త సినిమా టైటిల్ ‘టార్గెట్’
కానీ అందులో ఛత్రపతి రీమేక్ ప్రస్తావన లేదు. దీంతో ఈ సినిమా ఇక ఆగిపోయినట్టేనని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి ఓ ప్రకటన రావాల్సి ఉంది. వేరే నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టును తీసుకుంటుందేమో వేచి చూడాలి.