Thursday, March 28, 2024
- Advertisement -

కాజల్ కోసం పడిగాపులు కాస్తున్న చిరు..?

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.. దాంతో ఈ షూటింగ్ జరపడానికి సమయం దొరకలేదు.. ఎప్పటికప్పుడు ఏదోక కారణం తో షూటింగ్ వాయిదా పడడంతో చిరంజీవి కూడా అన్ని సెట్ చేసి త్వరలోనే సినిమా ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని దర్శకుడికి క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారని తెలుస్తుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశాం.. దానికి మంచి బజ్ వచ్చింది.. ఆ బజ్ ని అలానే కంటిన్యు చెసి సినిమా ను త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనీ చిరు చెప్పాడట..

అన్ని సినిమాలు తిరిగి షూటింగ్ ప్రారంభించుకోవడంతో చిరు సినిమా ఎందుకు ఇంకా షూటింగ్ కి వెళ్లట్లేదనే సహనం అయితే ప్రేక్షకుల్లో ఉంది.. ఆఖరుకి రాజమౌళి కూడా ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో RRR షూటింగ్ మొదలుపెట్టేసాడు. ఇక రామ్ చరణ్ కూడా ఆచార్య పై స్పష్టత ఇవ్వడం లేదు. దాంతో మెగా అభిమానులకు రోజు రోజు కు షూటింగ్ మొదలుకావట్లేదనే టెన్షన్ ఎక్కువైపోయింది.. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ అయినా కాజల్ రాకపోవడం వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతుందని చెప్తున్నారు..

ఇటీవలే కాజల్ అగర్వాల్ తన పెళ్లి గురించి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. కరోనా లాక్ డౌన్ లోనే ఆమె పెళ్లాడుతుంది. ఈనెల ముప్పైన కాజల్ పెళ్లి జరగబోతుంది. హోటల్ లో కుటుంబ సభ్యుల మధ్యన పెళ్లి జరిగినా ప్రస్తుతం పెళ్లి షాపింగ్, బ్యాచులర్ పార్టీలు, మెహిందీ, సంగీత్ అంటూ బోలెడంత హడావిడి ఉంటుంది. మరి కాజల్ పెళ్లి అయ్యాకా ఆచార్య షూటింగ్ మొదలవుతుందా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.. కాజల్ పెళ్లి తర్వాత 16 రోజుల పండగ లోపులోనే ఆచార్య సినిమా షూటింగ్ కి వచ్చినా వచ్చేస్తుంది. ఎందుకంటే తాను పెళ్లి తర్వాత నటిస్తానని క్లియర్ గా చెప్పింది కాబట్టి. మరి ఆచార్య షూటింగ్ విషయమై కనీసం ఓ అప్ డేట్ ఇస్తే బావుంటుంది అంటూ మెగా ఫాన్స్ తొందరపడుతున్నారు.

అనుష్క తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే నా..?

గంగవ్వ కి చిరంజీవి భరోసా.. ఏంటి ఈ కథ ?

మహేష్ , బన్నీ కి వారు కరువయ్యరుగా..?

డబ్బులకు టెంప్ట్ అయిన కాజల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -