Saturday, May 4, 2024
- Advertisement -

ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ.. అసలు కథ ఏమిటంటే?

- Advertisement -

సాధారణంగా భారతీయ నటీనటులు పాన్ ఇండియా చిత్రాలలో కనిపించడం సర్వసాధారణం అయినప్పటికీ, హాలీవుడ్ చిత్రాలలో నటించడం అంటే ఒక గొప్ప వరంగా భావిస్తారు. ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్కరికి రావు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా ఆ స్థాయిలోనే తెరకెక్కుతుండగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోయే సినిమా మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందనే సమాచారం వినబడుతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
హాలీవుడ్ చిత్రంలో ప్రభాస్ నటించబోతోన్నట్టు రూమర్లు బయటకు వచ్చేశాయి.

Also read:టాలీవుడ్ లో అడుగుపెడుతున్న శ్రీదేవి చిట్టి కూతురు..?

రాధే శ్యామ్ షూటింగ్ కోసం ప్రభాస్ ఇటలీ వెళ్ళినప్పుడు అక్కడ మిషన్ ఇంపాజిబుల్7 షూటింగ్ జరగడంతో ఈ చిత్ర దర్శకుడు క్రిస్టోఫర్ మాక్ క్వరీ ప్రభాస్ ను కలసి ప్రభాస్ కి కథ చెప్పినట్లు, ఆ కథ ప్రభాస్ కి కూడా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ నెటిజెన్ మాత్రం
ఏకంగా సదరు హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ మాక్ క్వరీకే ట్వీట్ వేసి అసలు విషయం బయటకు తెలిపాడు.

Also read:పూజ హెగ్డేకు ఫిదా అయినా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..?

ఇండియన్ హీరో ప్రభాస్ మిషన్ ఇంపాజిబుల్7లో నటించబోతోన్నట్టు వార్తలు వస్తున్నాయ్. అది నిజమా? సర్ అని అడిగగా అందుకు సదరు దర్శకుడు స్పందిస్తూ… ప్రభాస్ ఎంతో టాలెంట్ ఉన్న హీరో,కానీ ఇప్పటివరకు మేము మాత్రం ఒక్కసారి కూడా కలవలేదు అని తెలియజేయడంతో ప్రభాస్ ఫైట్ హాలీవుడ్ చిత్రం గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -