Saturday, May 4, 2024
- Advertisement -

బాలయ్యతో ‘క్రాక్’ డైరెక్టర్?

- Advertisement -

డైరెక్టర్ గోపి చంద్ మలినేని ప్రస్తుతం అందరి చూపులు తనవైపు తిప్పుకుంటున్న దర్శకుడు. ఈ సంక్రాంతికి క్రాక్ సినిమాతో కంప్లీట్ హిట్ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు.ప్రస్తుతం ఈ యువ దర్శకుడికి డిమాండ్ గట్టిగానే పెరుగుతోంది. సాధారణంగా ఒక సినిమా హిట్ అయ్యింది అంటే హీరోలకంటే ఎక్కువగా దర్శకుల పైనే ఎక్కువ దృష్టి పడుతోంది. అలాగే గోపీచంద్ మలినేని పై కూడా స్టార్ హీరోల దృష్టి గట్టిగా పడింది.

అతనితో ఎలాగైనా ఒక సినిమా చేయాలని చర్చలు జరుపుతున్నారు. అయితే ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా గోపిచంద్ చూపు ఒక్కరిపైనే ఉంది. క్రాక్ సినిమా రిలీజ్ కంటే ముందు నుంచే ఈ దర్శకుడు బాలకృష్ణతో సినిమా చేయాలని ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటూ ఉన్నాడు.లాక్ డౌన్ లోనే ఆ సినిమా మెయిన్ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ నుంచి పిలుపు వచ్చినా.. బాలీవుడ్ నుంచి క్రాక్ రీమేక్ ఆఫర్ వచ్చినా కూడా గోపిచంద్ నెక్స్ట్ మాత్రం బాలయ్య సినిమాతోనే రావాలని నిర్ణయించుకున్నాడట.ఆ మాస్ కథకు బాలకృష్ణ తప్ప మరెవరు సరిపోరట. ఇక అసలు విషయానికి వస్తే ఆ సినిమాను మే నెలలో మొదలు పెట్టాలని గోపిచంద్ భావిస్తున్నాడట.

ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత బి.గోపాల్ తో సినిమా చేస్తాడని కథనాలు వినిపిస్తున్నాయి. కాని ప్రస్తుత పరిస్థితి చూస్తే బాలయ్యకు మంచి హిట్ కావలి. హిట్ కావాలంటే గోపి చంద్ తో సినిమా చెయ్యాలి. చూడాలి మరి ఈ కాంబినేషన్ వర్క్ ఔట్ అవుతుందో లేదో…

సోహెల్ తో అరియానా మళ్ళీ రెచ్చిపోయిందిగా…!

ఇదే పని వైసీపీ చేస్తే.. నిమ్మగడ్డ ఇంత సుతారంగా చెప్పేవారా?

నిమ్మగడ్డ యాప్ కి షాక్.. అప్పుడే వద్దు.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -