Monday, May 6, 2024
- Advertisement -

40 ఏళ్ల వయసులో సునామీ ఇన్నింగ్స్, చూస్తారా!

- Advertisement -

క్రిస్ గేల్ మరోసారి తన సునామీ ఇన్నింగ్స్ తో యూనివర్సల్ క్రికెట్ బాస్ అనిపించుకున్నాడు. 40 ఏళ్ల వయసులోనూ సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు. అబుదాబి టీ10 లీగ్‌లో భాగంగా బుధవారం మరాఠా అరేబియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ అబుదాబికి ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్‌ 22 బంతుల్లోనే 9 సిక్స్‌లు, 6 ఫోర్లు బాది 84 పరుగులతో నాటౌట్ గా నిలిచి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. కొడితే ఫోర్‌.. లేదంటే సిక్స్‌ అన్నట్లుగా గేల్ చెలరేగడంతో ప్రత్యర్థి బౌలర్లు బంతి వేసి బౌండరీ వైపు చూడాల్సిన పరిస్థితి.

కేవలం 12 బంతుల్లోనే అర్థం సెంచరీ పూర్తి చేసుకున్న గేల్.. టీ10 చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన మహమ్మద్ షహజాద్ రికార్డును సమం చేశాడు. 2018 సీజన్ లో షెహజాద్ రాజ్‌పుత్స్ తరఫున ఆడి 12 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన మరాఠా అరేబియన్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన టీమ్‌ అబుదాబి ఓపెనర్‌ గేల్ వీరవిహారం తో 5.3 ఓవర్లలోనే గెలుపును అందుకుంది. గేల్ చేసిన 84 పరుగుల్లో 78 పరుగులు ఫోర్ల రూపంలోనే వచ్చాయి.

పీటర్‌సన్‌ కు ప్రధాని మోదీ రిప్లై

ఓటుకు 5 వేలు.. సరిపోవంటే 10 వేలు తీసుకోండి!

ఓటుకు 5 వేలు.. సరిపోవంటే 10 వేలు తీసుకోండి!

ఆప్రికాట్ తింటే చక్కటి ఆరోగ్యం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -