Wednesday, May 1, 2024
- Advertisement -

నిమ్మగడ్డ యాప్ కి షాక్.. అప్పుడే వద్దు.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

- Advertisement -

ఈ-వాచ్‌ యాప్‌ను ఈ నెల 9 వరకు వినియోగించొద్దని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఇటీవలే ప్రారంభించిన ఈ యాప్‌పై పలువురు న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. ప్రైవేటు వ్యక్తులు అభివృద్ధి చేసిన యాప్​ను ఎస్ఈసీ తీసుకువస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ అభ్యంతరాలపై… న్యాయస్థానంలో వాదనలు జరిగాయి.

భద్రతా ధ్రువపత్రం అందలేదన్న ప్రభుత్వ న్యాయవాది వాదన మేరకు… హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ధ్రువపత్రం రావడానికి మరో 5 రోజులు పడుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. హైకోర్టు తదుపరి విచారణను 9కి వాయిదా వేసింది.

ఈ యాప్‌ను ఈ నెల3న నిమ్మగడ్డ రమేష్ ఆవిష్కరించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే క్రమంలో ప్రత్యేకంగా యాప్‌ తీసుకొస్తున్నట్లు ఎన్నికల కమిషనర్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార నిమిత్తం ఏర్పాటుచేస్తున్న కాల్‌ సెంటర్‌ని కూడా ప్రారంభించారు. మరోవైపు ఈ యాప్‌ను ప్రభుత్వం తప్పుబడుతోంది.

హాట్ హాట్ గా ‘పిట్ట కథలు’ ట్రైలర్ అలరిస్తోంది..!

ఏకగ్రీవాలపై ఎస్ఈసీ మరో సారి ఆగ్రహం..!

పసుపు తో ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -