Tuesday, May 21, 2024
- Advertisement -

ఎంత రేటుకు అంత రచ్చ రంబోలా

- Advertisement -

దేవిశ్రీ ప్రసాద్ తో  యవ్వారమంటే…  ఆషామాషి విషయం కాదు. ఏం చేసినా ఓ రేంజ్ లో ఫుల్ జోష్ తో చేస్తే గాని మనోడు రిలాక్స్ కాడు.అతనిచ్చే  జోష్ ఫుల్ ఎనర్జీకి…. ఆడియో లాంచ్ లు సగం వరకు అలా సక్సెస్ అయిపోతూ ఉంటాయి. ఇది చూసే కాబోలు దేవిశ్రీతో ప్రొడ్యూసర్లు కొత్త కమిట్ మెంట్ లు చేసుకుంటున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీకు ఇప్పట్లో  ఎలాంటి ప్రాబ్లెమ్స్  వచ్చి పడేలా లేవు.ఆడియో లాంచ్స్ లో మనోడు చేసే హడావిడితోనే…. దేవి ప్రేక్షకులను అలా కట్టిపడేస్తున్నాడు. మెగా సినిమాలతో మొదలైన ఈ ట్రెండ్….మిగతా హీరోల విషయంలో కూడా  కనిపిస్తుంది. దేవి ఉంటే చాలు తమ పనై పోతుందనుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. శ్రీమంతుడు ఆడియో లాంచ్ నే తీసుకుందాం. ఈ ఆడియో లాంచ్ లో అంతా ఏవేవో జరిగిపోతాయని 

సినీ ప్రేక్షకులు ఊహించేసుకున్నారు.కట్ చేస్తే… దేవిశ్రీ చేసిన హంగామా తప్ప ఏం కనిపించలేదు. కేవలం ఇలా చేసినందుకు గాను మనోడు తనకిచ్చిన రెమ్యునిరేషన్ కాకుండా ఇంకో 20 లకారాలు లాగాడని  చెబుతున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ రచ్చ రంబోలాకు ముందునుంచి మెగా కాంపౌండ్ వంత పాడుతూనే ఉంది.అది అన్ని రకాలుగా వర్కవుట్ అవుతూ ఉండడంతో మిగతావారు కూడా దేవిని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు.

దీంతో సారు ఎంత రేటు కు అంత హడావిడి అనే సందేశాన్ని జనాల్లోకి తీసుకుపోయారు. దేవిశ్రీ హల్చల్ ఇంతలా ఫోకస్ అయ్యి… నోటెడ్ కావడానికి మెయిన్ రీజన్ … మనోడు భామలతో వేసిన చిందులు.అవార్డ్స్ ఫంక్షన్లోను దేవి చేసే చిలిపి కబుర్లు,చిలిపి చేష్టలు కొందరికి చిరాకు అనిపించినా… ఆ మూడ్ లో అది అలా వెళ్లిపోతూ ఉంటుంది.ఇలాంటి వాతావరణాన్ని తీసుకురావడం దేవీకి వెన్నతో పెట్టిన విద్య. అవసరమైతే తారలతో,హీరోలతో డాన్స్ లు ,పాటలు ఊడా పాడించేస్తూ ఉంటాడు.అయితే… చక్రి తరహా మాస్ రితమ్ ఇచ్చేవారు… మార్కెట్లో ఇంకా ఎవ్వరూ లేకపోవడంతో మొన్నటివరకు చక్రీని నమ్ముకున్న వారు చక్రి మరణం తర్వాత ఇపుడు దేవి చెంతకు వచ్చేశారు. దీంతో మనోడు ఆడిందే ఆట పాడిందే పాట చేసిందో గోల అన్న చందంగా క్లైమేట్ మారిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -