Wednesday, May 22, 2024
- Advertisement -

నటసింహంతో మూవీ కి రెడీ అవుతున్న దిల్ రాజు…!

- Advertisement -

తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దాదాపు తెలుగు ఇండస్ట్రీలో అందరి హీరోలతో వర్క్ చేశారు. చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా అందరిని కవర్ చేసుకుంటూ వస్తున్న దిల్ రాజు గతంలోనే పవన్ కళ్యాణ్ తో ఎన్నోసార్లు సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఇన్నాళ్లకు పింక్ రీమేక్ ద్వారా పవన్ సినిమాను నిర్మించే అవకాశం వచ్చింది.అలాగే నందమూరి ఫ్యామిలిలో జూనియర్ ఎన్టీఆర్ తో పలు సినిమాలను నిర్మించిన దిల్ రాజు.

ఇప్పుడు మొదటిసారి నందమూరి నటసింహం బాలకృష్ణపై కూడా ఒక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల సినిమా కెరీర్ లో దిల్ రాజు బాలయ్యతో సినిమా చేస్తున్నట్లు టాక్ కూడా రాలేదు. ఇక మొత్తానికి నెక్స్ట్ ఇయర్ అది నిజం కావచ్చని సమాచారం.ఇక దిల్ రాజుతో చేయబోయే సినిమాకు దర్శకుడు ఎవరంటే.. అనిల్ రావిపూడి అని తెలుస్తోంది.

గతంలో బాలకృష్ణకు అనిల్ ఒక సినిమా కథ చెప్పాడు. రామారావు అనే టైటిల్ కూడా అనుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక దిల్ రాజు ఇప్పుడు ఈ కాంబినేషన్ ను కలిపి బిగ్ బడ్జెట్ తో సినిమాని నిర్మించడానికి రెడీ అయినట్లు సమాచారం అందుతుంది.ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడోసారి సినిమా చేస్తున్నాడు.

వ్యవసాయం నేపథ్యంలో ‘శ్రీకారం’ ఆకట్టుకుంటున్న ట్రైలర్!

ఆకట్టుకుంటున్న ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్!

యువ బ్యాట్స్​మన్ శతకం.. ఎన్ని ఫోర్లు అంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -