Monday, May 20, 2024
- Advertisement -

భయపెట్టబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్…!

- Advertisement -

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వరలక్ష్మి శరత్ కుమార్. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకుంది.ఇటీవల మాస్ మాహారాజా ‘క్రాక్’, అల్లరి నరేష్ ‘నాంది’ సినిమాలలో అద్భుతమైన నటన కనబరిచి ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను తన నటనతో అమితంగా ఆకట్టుకున్న విలక్షణ తార వరలక్ష్మీ శరత్‌కుమార్ నాయికగా తెలుగులో ఇంకో కొత్త సినిమా చేస్తుంది.హవీష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కాంచన కోనేరు ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కోనేరు సత్యనారాయణ సమర్పిస్తున్న ఈ చిత్రానికి డార్లింగ్ స్వామి దర్శకుడు. వరలక్ష్మీ శరత్‌కుమార్ బర్త్‌డేని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్ట్‌ర్‌ను రిలీజ్ చేశారు.

హారర్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందే ఈ సినిమాలో వరలక్ష్మి ఓ విలక్షణ పాత్రలో కనిపించనున్నారు. మురళీకృష్ణ కొడాలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించే ఈ చిత్రానికి గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, అమర్ రెడ్డి ఎడిటర్‌గా ఈ సినిమాకి పని చేస్తున్నారు.

వ్యవసాయం నేపథ్యంలో ‘శ్రీకారం’ ఆకట్టుకుంటున్న ట్రైలర్!

ఆకట్టుకుంటున్న ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్!

యువ బ్యాట్స్​మన్ శతకం.. ఎన్ని ఫోర్లు అంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -