Friday, April 26, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ పై రాజమౌళి షాకింగ్ డెసిషన్!

- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అటు మెగా అభిమానులు ఇటు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతూ ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

ఎట్టకేలకు మొదటిదశ కరోనా తరువాత ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల చేయాలన్న ఉద్దేశంతో దర్శకుడు రాజమౌళి శరవేగంగా షూటింగ్ పనులను ప్రారంభించారు. ఈ క్రమంలోనే రెండవ దశ కరోనా విజృంభించడంతో ఈ సినిమా షూటింగ్ తిరిగి వాయిదా పడింది. కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారు. షూటింగ్ ప్రారంభించినప్పటికీ అనుకున్న ప్రకారమే అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల చేస్తుందని ఇదివరకు చిత్రబృందం ప్రకటించారు.

Also read:హోల్ సెల్ గా అభిమానులను బురిడీ కొట్టించిన డాక్టర్ బాబు?

తాజాగా ఈ సినిమా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పలు కీలక యాక్షన్ సన్నివేశాలు, క్లైమాక్స్ సీన్ షూటింగ్స్ ఉండడంతో ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం అక్టోబర్ 13న విడుదల కాకపోవచ్చని చిత్రబృందం భావిస్తోంది.షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి సుమారుగా ఆరు నెలల సమయం పడుతుందని భావించిన చిత్ర బృందం ఈ సినిమా విడుదలను వచ్చే ఏడాది ఏప్రిల్ 28 కి పోస్ట్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా “ఆర్ఆర్ఆర్” సినిమా వాయిదా పడడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Also read:ఇన్నాళ్ల కెరీర్ లో స్టైలిష్ స్టార్ మిస్ చేసుకున్న సినిమాలు ఏవో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -