Friday, April 26, 2024
- Advertisement -

ప్రభాస్ సలార్ సినిమాలో సందడి చేయనున్న సీనియర్ నటి?

- Advertisement -

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన “రాదేశ్యామ్” దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్ కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.

ప్రశాంత్ నీల్ “సలార్” సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ పాత్రలో సందడి చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా ఈ సినిమా షూటింగ్ వాయిదాపడింది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఓ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Also read:కొత్త ఇంట్లోకి చేరబోతున్న మహేష్ బాబు.. ?

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన “సలార్” సినిమాలో ప్రభాస్ సోదరి పాత్ర కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ సీనియర్ నటి జ్యోతి సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కు అక్కగా నటించడానికి జ్యోతిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో గురించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.నటి జ్యోతిక ఇదివరకు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్”చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Also read:నాగార్జున, కోదండరామిరెడ్డి కాంబో సక్సెస్ ఫుల్ సినిమాలు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -