Friday, May 3, 2024
- Advertisement -

అల్లు అర్జున్ దువ్వాడ జ‌గ‌న్నాథం స్టోరీ లీక్!

- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ స‌మ్మ‌ర్‌లో స‌రైనోడు లాంటి ఊర‌మాస్ బ్లాక్‌బస్ట‌ర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా బ‌న్నీ కేరీర్‌లోనే హ‌య్య‌స్ట్ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుల‌కు ఎక్కింది. ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ హ‌రీష్‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకు దువ్వాడ జ‌గ‌న్నాథం (డీజే) అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ గురించి ఇండ‌స్ట్రీలో ఓ స్టోరీ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఈ స్టోరీ ప్ర‌కారం ఊళ్ళో ఉండి డ్యాన్సులు ఇరగదీసే జగన్నాథం. చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్సులు నేర్చుకుని ఉంటాడు. టీనేజ్ వయసుకి అన్ని రకాల డ్యాన్సుల్లోనూ ప్రావీణ్యం సంపాదిస్తాడు. దీంతో బ‌న్నీ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ డీజే అవ్వాల‌ని హైద‌రాబాద్ వ‌స్తాడు. అయితే అక్క‌డ కొంద‌రు బ్రోక‌ర్లు మ‌నోడికి దెబ్బేయడంతో బ‌జారున ప‌డ‌తాడు.

ఈ టైంలో డీజేలోని టాలెంట్ గుర్తించిన హీరోయిన్ మ‌నోడికి హెల్ఫ్ చేస్తుంది. అయితే అదే అమ్మాయి వ‌ల్ల బ‌న్నీకి ప్రేమ ప్రాబ్ల‌మ్ వ‌స్తుంది. ఆ త‌ర్వ‌త బ‌న్నీకి వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను మ‌నోడు ఎలా ఫేస్ చేశాడు ? ఫైన‌ల్‌గా స్టోరీ ఎలా మ‌లుపులు తిరిగి ఎలా ముగిసింది అన్న‌దే డీజే సినిమా స్టోరీ అని స‌మాచారం.

డిజెగా బన్నీ డ్యాన్సులను ఏ రేంజ్‌లో ఇరగదీసి ఉంటాడో వేరే చెప్పాలా? ప్రస్తుతం కొరియోగ్రాఫర్స్‌తో కలిసి కూర్చుంటున్నాడట హరీష్. ది బెస్ట్ డ్యాన్సులను డిజైన్ చేయిస్తున్నాడట. ఇప్పటి వరకూ వచ్చిన అన్ని తెలుగు సినిమాల్లోకి ది బెస్ట్ డ్యాన్స్ ఈ సినిమాలో ఉంటుంద‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

Related

  1. అల్లు అర్జున్ వద్దు అంటే ఎన్టీఆర్ ఓకే అంటున్నాడు!
  2. అల్లు అర్జున్ కి ఎలాంటి బిరుదు ఇచ్చారో తెలుసా?
  3. అల్లూ అర్జున్ కి చుక్కలు చూపించిన సాయి ధరం తేజ
  4. అల్లు అర్జున్ పట్టించుకోకున్నా విష్ చేసిన జక్కన్న

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -