Sunday, May 12, 2024
- Advertisement -

డీజే మూవీలో ఉహించని సీక్రెట్ లీక్ అయింది

- Advertisement -
Duvvada Jagannatham Secret Leaked

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆరోగ్యం పై రకరకాల రూమర్లు హడావిడి చేస్తూ ఉన్నా అవి ఏమి పట్టించుకోకుండా ‘దువ్వాడ జగన్నాథం’  సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీని ఎట్టి పరిస్థితులలోను  ఈ సమ్మర్ రేస్ లో నిలపెట్టాలని దర్శకుడు హరీష్ శంకర్ చాలా గట్టిప్రయత్నాలే చేస్తున్నాడు.

అయితే ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈమూవీ ఫస్ట్‌ లుక్‌ లో కనిపించిన రూపం వెనుక అసలు రూపం ఇంకొకటి ఉందనీ, అది పోలీస్‌ రూపమనీ ప్రచారం జరుగుతోంది. బన్నీ ఈచిత్రంలో అండర్‌ కవర్‌ పోలీస్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడని, కథ ప్రకారం బ్రాహ్మణ వంటవాడి వేషం వేస్తాడు అంటూ ఒక ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రిక ఒక ఆసక్తికర కధనాన్ని  ప్రచురించింది.  దీనితో పాటు రెండేళ్లకు పైగా టాలీవుడ్‌కు విరామమిచ్చి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న పూజా హెగ్డే గ్లామర్‌ ఈ సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్ అన్న విషయాన్ని కూడ బయటపెట్టింది.

పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్‌సింగ్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తీసిన హరీష్ శంకర్ జూనియర్ తో  ‘రామయ్యా వస్తావయ్యా’తో ఘోరమైన ఫ్లాప్ ను మూట కట్టుకున్న తరువాత తిరిగి మళ్ళీ  ఒక టాప్ హీరోతో తీస్తున్న సినిమా కావడంతో హరీష్ శంకర్ ఈ సినిమా విషయంలో అనేక జాగ్రతాలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాతగా దిల్‌ రాజుకు ఇది 25వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా ద్వారా 70 కోట్ల కలెక్షన్స్ మార్క్ పై కన్నువేసిన బన్నీకి కూడ ఈ సినిమా విజయం కీలకంగా మారడం తో ఈ సినిమా గురించి బన్నీ చాలా కష్టపడుతున్నాడు.

{youtube}Zj-2nZ7Lgpg{/youtube}

Related

  1. డీజే టీజర్ ఎలా ఉందంటే..?
  2. రాజేంద్ర ప్రసాద్ ముసలి ఏజ్ లవ్ స్టోరీ .. అల్లూ అర్జున్ ప్రొడ్యూసర్ !
  3. బ్రేకింగ్ : అల్లు అర్జున్ సినిమాలో మెగాస్టార్ చేసే రోల్ ఇదే
  4. అల్లు అర్జున్ కోసం పవన్.. ఆ పని చేస్తాడా..? ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -