Tuesday, May 14, 2024
- Advertisement -

డీజే టీజర్ ఎలా ఉందంటే..?

- Advertisement -
DJ Movie First Look Teaser

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో మాస్ హీరోలా కనిపించి అదరగొట్టాడు. ఇప్పుడు బన్నీ స్వచ్ఛమైన బ్రాహ్మణుడిలా కనిపించబోతున్నాడు. హరీశ్ శంకర్ డైరక్షన్లో రూపందుతున్న ”దువ్వాడ జగన్నాథమ్” మూవీ లో బ్రాహ్మణుడిలా కనిపించనున్నారు. ఇప్పుడు శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేశారు.

ఇందులో బన్నీ నుదుట నామాలు.. చేతిలో రుద్రాక్ష దండ.. పొద్దున్నే నియమంగా హారతులు.. అబ్బో ఇంప్రెసివ్ లుక్కుతో అదరగొట్టాడు. హరీశ్ శంకర్ స్వయంగా ఆయనే ఒక బ్రాహ్మణుడు కావడం వలనేమో.. ఈ క్యారక్టరైజేషన్ బాగా చెక్కేశాడు. అగ్రహారంలో అలా బండేసుకుని బన్నీ వెళుతుంటే దాని లెక్కే వేరుగా ఉంది.

అదే టైంలో అల్ర్టా మోడ్రన్ గా హీరోయిన్ పూజా హెగ్డే ఎంట్రీ ఇచ్చింది. అమ్మడు మనోడికి ముద్దులెట్టేస్తుంటే.. ”ఇలా ఇలా ముద్దులు పెట్టేసి సభ్యసమాజానాకి ఏం మెసేజ్ ఇద్దామని??” అంటూ బ్రాహ్మణుడి తరహాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ మాడ్యులేషన్ అదరహో అనేలా ఉంది. ఇకపోతే వంటలు చేసుకునే ఆచారి పాత్రలో అల్లు అర్జున్ ఇరగదీయగా.. అయానక బోస్ అందించిన సినిమాటోగ్రాఫీ చాలాబాగుంది. తమ బ్యానర్ 25వ సినిమా కావడంతో.. దిల్ రాజు కూడా చాలా రిచ్ గా సినిమాను రూపొందించేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రస్తుతానికి పర్వాలేదు.

{youtube}v=YA48dqwrunE{/youtube}

Related

  1. షాకింగ్ : అల్లు అర్జున్ మూవీ ఆగిపోయిందా…?
  2. అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్ ఘోరమైన కామెంట్స్!
  3. అల్లు అర్జున్ డీజే పోస్టర్ లో పవన్ కళ్యాణ్
  4. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -