Tuesday, May 14, 2024
- Advertisement -

అభిమానులకు పవర్ స్టార్ సూపర్ న్యూస్!

- Advertisement -
Good news for Pawan kalyan Fans

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న మూవీ.. ‘కాటమరాయుడు’. ఈ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ అయ్యినప్పటి నుంచి ఈ చిత్రం అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇక నుంచి ‘కాటమరాయుడు’ మూవీకి సంబంధించిన గుడ్ న్యూస్‍లని ఫ్యాన్స్ కి చెప్పనున్నాడు. రీసెంట్ గా  ఈ నెల 9వ తేదీ నుండి యూఎస్ పర్యటనకు వెళ్లి ముగించుకొని వచ్చిన తర్వాత వెంటనే 14వ తేదీ నుండి ‘కాటమరాయుడు’ కి సంబంధించిన సీన్స్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

పవన్ పై తీయాల్సిన కొన్ని సీన్స్ దర్శకుడు డాలీ ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. అలానే పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన వర్క్ కూడా వేగంగా జరుగుతోంది. ఇంకోవైపు సినిమా యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచారు. ఇక తర్వాత వారం నుండి ‘కాటమరాయుడు’ మూవీకి సంబంధించిన విజువల్ ట్రీట్ ఫ్యాన్స్ ముందుకు రానుందని అంటున్నారు. ప్రతి రోజు ‘కాటమరాయుడు’ మూవీకి సంబంధించిన ఏదొక వీడియో విజువల్ బయటకు రానుందని అంటున్నారు.

దీంతో ఇప్పటి నుండి ‘కాటమరాయుడు’ మూవీ రిలీజ్ వరకూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండుగ వాతావరణమే అంటున్నారు. మార్చి నెల మూడో వారంలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఆడియోని కూడా త్వరలోనే భారీగా చేయబోతున్నారట. తమిళ హీరో ‘అజిత్’ నటించిన ‘వీరమ్’ సినిమాకు రీమేక్ గా ‘కాటమరాయుడు’ తెరకెక్కుతోంది.

Related

  1. పవన్.. పవర్ స్టార్ కావడానికి కారణం ఎవరు?
  2. పవర్ స్టార్ కు సూపర్ స్టార్ సలహా ఇచ్చాడు!
  3. ముఖ్యమంత్రి .. పవన్ కళ్యాణ్ .. సీఎం పవర్ స్టార్
  4. ప్రత్యేక హోదా పై సాయి ధరమ్ తేజ్ పంచ్.. పవన్ ఫాన్స్ కి కోపం వచ్చింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -