Saturday, May 4, 2024
- Advertisement -

పవర్ స్టార్ కు సూపర్ స్టార్ సలహా ఇచ్చాడు!

- Advertisement -
mahesh given advice to pawan

టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ – ప్రిన్స్ మ‌హ‌ష్. వీరిద్దరు సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. అలాగే వీరి సినిమాల మధ్య పోటీ కూడా బానే ఉంటుంది. సినిమాల పరంగా ఎలా ఉన్న వ్య‌క్తిగ‌త విష‌యాల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి వీరిద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా ఫంక్ష‌న్ల‌కు ఒక‌రి నొక‌రు పిలుచుకోవ‌డం.. ఆప్యాయ‌త‌గా ఉండ‌డం చేస్తుంటారు. ఇది మంచి ప‌ద్ద‌తి కూడా.. ఇటువంటి సంఘ‌ట‌న‌లు ఇటీవ‌ల ఎక్కువ‌గా చోటుచేసుకోవ‌డం కూడా శుభ‌ప‌రిణామ‌మే.

రీసెంట్ గా ప‌వ‌ర్‌స్టార్ పవన్ క‌ళ్యాణ్‌కు మహేష్ బాబు ఓ మంచి సలహా ఇచ్చాడు? ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా అయ్యింది. ఇంతకి పవన్ కు ఏ విషయంలో ప్రిన్స్ సలహా ఇచ్చాడు అనేది ఆసక్తిక‌రంగా మారింది. పవన్ కళ్యాణ్ తదుప‌రి చేసే చిత్రాల విషయాల్లో కాస్త కేర్ తీసుకోమ‌ని మ‌హేష్ ప‌వ‌న్‌కు స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. పవన్ ప్రస్తుతం చేస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రం తర్వాత కోలీవుడ్ హిట్ డైరెక్ట‌ర్ నేసన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

తాజాగా నేసన్ దర్శకత్వం వహించి రిలీజ్ అయిన తమిళ సినిమా భారీ ఫ్లాప్ కావ‌డంతో నేస‌న్ సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించాడ‌ట‌. ఆ దర్శకుడిని మారిస్తే బెటర్ అని కూడా స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. తమిళ ‘వీరం’ చిత్రానికి రీమేక్ గా రూపొందే ఈ సినిమా విషయంలో మహేష్, పవన్ కు జాగ్రత్తలు సూచించాడు. మహేష్ ఇచ్చిన స‌ల‌హాల సూచ‌న‌ల‌ను పాటించి డైరెక్టర్ ని మారుస్తాడా లేక ఏదైనా ఇత‌ర మార్గాల‌ను అన్వేషిస్తాడో వేచి చూడాలి.

Related

  1. మహేష్ బాబుని ఇంప్రెస్ చేసిన కీర్తి సురేష్‌!
  2. మహేష్ బాబు ఆస్తి ఎంతో తెలుసా?
  3. 2,500 మంది పిల్లలకు దీపావళి కానుకగా గిఫ్ట్‌ బాక్స్‌లు పంపిన సూపర్‌స్టార్‌ మహేష్‌
  4. సమంత ఫ్యాన్స్ కు మహేష్ కుమార్తె సర్ ప్రైజ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -