Wednesday, May 15, 2024
- Advertisement -

టాప్ హీరోకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన న‌య‌న‌తార

- Advertisement -

సౌత్ ఇండియాలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కొనసాగుతోంది అందాల భామ నయనతార. సినిమా సినిమాకి నయనతార క్రేజ్ మరింత పెరిగిపోతుంది. సినిమా ప్రమోషన్లో పాల్గొనదు కానీ.. డేట్స్ విషయంలో పక్కాగా ఉంటుంది. నయనతార రెమ్యునరేషన్ చాలా ఎక్కువ అని ఆమెపై విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయినా న‌య‌నకు ఉన్న డిమాండ్ మరే హీరోయిన్‌కు లేదంటే అతిశ‌యోక్తి కాదు.

తెలుగు-త‌మిళ‌-మ‌ళ‌యాళ భాష‌ల్లో దూసుకుపోతోన్న న‌య‌న‌తార‌ తమిళంలోని ఓ టాప్ హీరోకి ఊహించని షాక్ ఇచ్చిందట. అసలు విషయంలోకి వెళ్తే… నయనతార తన ప్రతి సినిమాకి దాదాపుగా  4కోట్ల పారితోషికాన్ని తీసుకుంటోంది. 2013లో ఆరంభం చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఈ సుందరి తమిళనాట వరుస సక్సెస్‌లతో దూసుకుపోతోంది. మూడు సంవ‌త్స‌రాల్లో న‌య‌న‌తార‌ వ‌రుస‌గా 9 హిట్స్ అందుకుంది. అయితే ఇటివలే జీవాతో చేసిన సినిమా ఒక్కటే ప్లాప్ గా నిలిచింది. నయనతార ఓ సినిమా చేస్తుందంటే ఆ సినిమా పక్కా హిట్ అనే టాక్ వచ్చేసింది.

దీంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆమెకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఆమె అడిగినంత రేటు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ఓ టాప్ హీరోతో టాప్ డైరెక్టర్ చేసే చిత్రంలో నటించమని నయనను అప్రోచ్ అయ్యార‌ట‌. అయితే నయన త‌న‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా రూ.4 కోట్ల‌కు త‌క్కువ ఇస్తే తాను ఈ సినిమాలో న‌టించ‌న‌ని తెగేసి చెప్పింద‌ట‌. దాంతో నయనతార అంత రేటు చెప్పేసరి దెబ్బకు షాక్ అయ్యారట ఆ పెద్ద హీరో, స్టార్ డైరెక్ట‌ర్. దాంతో ఆ ఇద్దరికి నయనతార గట్టిగానే షాక్ ఇచ్చిందని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

Related

  1. నయనతార పని అయిపోయింది!
  2. నయనతారకు ముద్దు ఇచ్చి షాక్ చేశాడు!
  3. నయనతార కొంప ముంచిన హీరో!
  4. అనసూయతో డేటింగ్ కి వెళ్తారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -