Thursday, May 16, 2024
- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యునరేషన్లు ఇవే!

- Advertisement -

టాప్ హీరోల క్రేజ్ వల్ల వారి పంట పండుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్‌ హీరోల ఇమేజ్‌ ప్రకారమే సినిమాల అమ్మకం జరుగుతోంది. నిర్మాతలు కూడా భారీ రేట్లకు సినిమాలను అమ్మి భారీగా లాభాలు పొందుతున్నారు. ఈ నేప‌థ్యంలో స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్ కూడా ఓ రేంజ్‌లో ఉంటోంది. నిజానికి ఒక స్టార్‌ హీరో సినిమాకు జరిగే వ్యాపారం నుంచి ఆ సినిమా హీరోకు 15 నుంచి 20 శాతం పారితోషికంగా ఇస్తారు.

ఇదంతా గతంలో జరిగిన పద్దతి కానీ, ఇప్పటి తీరు మారింది. స్టార్‌హీరోల‌ ఇమేజ్‌ ఆమాంతం పెరిగింది. ఇక సినిమా బిజినెస్ గ‌తంలో కంటే ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. శాటిలైట్‌, డబ్బింగ్‌ అమ్మాకల వల్ల కూడా నిర్మాతలకు ఆదాయం వస్తోంది. ఇది హీరో స్టార్‌డమ్‌ను అనుసరించే జరుగుతుంది కాబట్టి అధిక మొత్తంలో వారి రేట్లు సైతం చుక్క‌ల్లో ఉంటున్నాయి. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా ఉన్న ప‌వ‌న్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ల గురించి ఇండ‌స్ర్టీలో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ కొద్ది రోజులుగా చ‌క్కెర్లు కొడుతోంది.

ఫిల్మ్‌న‌గ‌ర్ స‌మాచారం ప్ర‌కారం పవన్‌కళ్యాణ్ ఒక్కో సినిమాకి 32 కోట్లు తీసుకుటున్నాడట. ఇక మహేష్‌బాబు ఒక్కో సినిమాకి 25 కోట్లు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ 22 కోట్లు పారితోషికం తీసుకుటున్నారట. సో ఈ రెంజ్ లో మన హీరోలు రెమ్యున‌రేష‌న్లు తీసుకుంటున్నారంటే వారి సినిమాలు భారీగానే బిజినెస్ జరుగుతోందని అర్ధం అవుతోంది.

Related

  1. ప‌వ‌న్‌కు ఊహించని షాక్ ఇచ్చిన సునీల్!
  2. ముఖ్య‌మంత్రి కాబోతున్న మ‌హేష్‌బాబు!
  3. ఎన్టీఆర్ ని రాజమౌళి ఎందుకు తిట్టాడంటే?
  4. ఎన్టీఆర్ కి భయపడ్డ అల్లు అర్జున్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -