Tuesday, April 30, 2024
- Advertisement -

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న హృతిక్… కాబోయే భార్య ఎవరంటే ?

- Advertisement -

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మళ్లీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా ? నటి సబా అజాద్‌తో పీకలోతు ప్రేమలో ఉన్నాడంటూ జరుగుతున్న ప్రచారాన్ని పెళ్లితో నిజం చేయబోతున్నాడా ? హృతిక్‌ ఈ మధ్య సబా ఆజాద్‌తో ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ మీడియా కెమెరా కంట పడుతున్నాడు. దీంతో ఈ పుకార్లు నిజమేనేమోనంటూ అందరూ అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పటి వరకు హృతికి ఈ వార్తలను ఖండించలేదు. పైగా ఇటీవల సబాను ఇంటికి కూడా తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా సబా హృతిక్‌ ఫ్యామిలీతో కలిసి లంచ్‌ చేసి, సరదాగా వారితో సమయాన్ని గడిపింది. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో హృతిక్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌ మారింది. త్వరలోనే హృతిక్‌, సబా పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల ఫర్హాన్‌ అక్తర్‌ తన ప్రేయసి శిబానీ దండేక‌ర్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

కొద్దిమంది సన్నిహితులు, బంధువుల, కుటుంబ సభ్యుల మధ్య ఫర్హాన్‌-శిబానీల వివాహం ప్రైవేట్‌గా జరిగింది. ఈ వేడుకకు హృతిక్‌ కూడా హజరయ్యాడు. దీంతో ఫర్హాన్‌ తరహాలోనే తాను కూడా కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నాడట. జీవితంలో ఒక తోడు అవసరమని భావించిన హృతిక్‌ తొందర్లోనే ప్రేయసి సబాను.. శ్రీమతిగా చేసుకోవాలని ఫిక్స్‌ అయ్యాడని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

మహా మాయగాడి ఉచ్చులో బాలీవుడ్ భామలు

మహేశ్‌కు విలన్‌గా విక్రమ్… మ్యాజిక్ చేయబోతున్న త్రివిక్రమ్

దుబాయ్‌‌లో ఆర్‌ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్… చీఫ్ గెస్ట్‌‌గా హాలీవుడ్ స్టార్ హీరో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -