Tuesday, April 30, 2024
- Advertisement -

ఎన్టీఆర్ జై ల‌వ కుశ కథ ఇదే!

- Advertisement -
jr ntr jai lava kusha movie story

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ టెంప‌ర్ చిత్రంతో తన ట్రెండ్ మార్చాడు. టెంప‌ర్ చిత్రం దగ్గర నుంచి డిఫరేంట్ స్టోరీలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఎన్టీఆర్.. టెంప‌ర్, నాన్నకు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ వంటి వరసగా వైవిధ్య‌మైన క‌థ‌లు ఎంచుకొని సూపర్ హిట్‍లను అందుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ కూడా అదే బాటలో వ‌రుస‌గా ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు.

ఈ నెపథ్యంలో ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత కాస్త చిన్న‌పాటి లాంగ్ గ్యాప్ తీసుకుని త‌న కొత్త చిత్రంకు సిద్ధం అవుతున్నాడు. త‌న సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌గా ప‌వ‌ర్, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‍ల దర్శకుడు బాబీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఓ సినిమాలో న‌టించ‌నున్నాడు.  ఇక ఈ చిత్రం కోసం దర్శకుడు బాబీ అదిరిపోయే డిఫ‌రెంట్ కథ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రం కథ లైన్ గురించి కూడా ఇండ‌స్ట్రీలో ఓ లైన్ చ‌క్కెర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ట‌.

ఈ మూడు పాత్రలు వేటికవే చాలా వైవిధ్య‌మంగా ఉంటాయని అంటున్నారు. ఈ మూడు పాత్రలను బట్టి ఈ చిత్రంకు “జై లవ కుశ” అని టైటిల్ పరిశీలిస్తున్నారు. అంటే, ఎన్టీఆర్‌ పోషించే మూడు పాత్రల పేర్లు జై – లవ – కుశగా ఉంటాయ‌ని తెలుస్తోంది. ఈ మూడు పాత్రలో రెండు పాజిటివ్ పాత్రలు అయితే మ‌రొక‌టి నెగిటివ్ పాత్రట. అంటే ఈ చిత్రంలో హీరోను, విల‌న్ రెండూ తార‌క్కే అన్న‌మాట‌. మ‌రి తార‌క్ విల‌న్ అంటే విన‌డానికే ఆస‌క్తిగా ఉంది. మరి విల‌న్ గా ఎన్టీఆర్ ఏ రేంజ్‌లో ఇర‌గ‌దీస్తాడో చూడాలి. మిగిలిన రెండు రోల్స్‌లో ఒక‌టి అదుర్స్‌లో చారి టైప్ రోల్ అయితే మ‌రొక‌టి పోలీస్ క్యారెక్ట‌ర్ అని తెలుస్తోంది.

Related

  1. ఎన్టీఆర్ గడ్డం పెంచడం వెనక కారణం ఇదే!
  2. ఎన్టీఆర్ వర్సెస్ పవన్.. పోటీలో గెలుపు ఎవరిది..?
  3. మహేష్, ఎన్టీఆర్, అఖిల్ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన చిరు!
  4. ఎన్టీఆర్ కొత్త సినిమాలు.. దర్శకులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -