Monday, May 13, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కొత్త సినిమాలు.. దర్శకులు..!

- Advertisement -
ntr next three movies

2016లో నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ వంటి సినిమాలతో రెండు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతలో వేసుకున్నాడు. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఇప్పటివరకు తన కొత్త సినిమాని మొదలు పెట్టలేదు. కరెక్టైన ప్లానింగ్ లేక తారక్ తన తదుపరి సినిమాని ఇంకా మొదలు పెట్టాలేదు.

ఈ లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ వరసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ 27వ చిత్రంగా త‌న సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించే చిత్రంకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. బాబీ డైరెక్షన్ ల్ తెరకెక్కబోయే ఈ సినిమా అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ చిత్రం ఉంటుంది. ఈ చిత్రం ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో మొదలు అవుతోంది. ఈ చిత్ర తర్వాత ఎన్టీఆర్ న‌టించే 29వ సినిమాకు కూడా ఓకే చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇష్క్, మనం, 24 వంటి సినిమాలు తీసిన దర్శకుడు విక్ర‌మ్ కె. కుమార్ చెప్పిన స్టోరీకి ఎన్టీఆర్ ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ బాబి-త్రివిక్ర‌మ్ సినిమాలు కంప్లీట్ చేసేలోపు విక్రమ్, అఖిల్ అక్కినేని హీరోగా సినిమాను కంప్లీట్ చేయనున్నాడు. ఆ వెంటనే విక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో సినిమా ఉంటుందని తెలుస్తోంది.

Related

  1. ఎన్టీఆర్ సినిమాలో అతిలోక సుందరి!
  2. హీరోయిన్ ని ఏడ్పించిన ఎన్టీఆర్‌!
  3. చరణ్ ని ఘోరంగా అవమానించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్!
  4. ఎన్టీఆర్ న్యూ లుక్ అదిరింది!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -