విలన్ గా ఎన్టీఆర్.. హీరో ఎవరో తెలుసా ?

Jr NTR to Play Both Hero and Villain Roles in Prashanth Neel Film
Jr NTR to Play Both Hero and Villain Roles in Prashanth Neel Film

టాలీవుడ్ లో జూ. ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న తారక్.. గతకొంత కాలంగా విభిన్నమైన సినిమాలు చేస్తూ.. వరుస విజయలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ” ఆర్ ఆర్ ఆర్ ” మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. దాంతో ఎన్టీఆర్ తరువాతి సినిమాలపై నార్త్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన బజ్ నెలకొంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత కే‌జి‌ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తారక్ ఓ సినిమా చేయనున్నాడు. దాంతో ఈ క్రేజీ కాంబో పై సౌత్ తో పాటు నార్త్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న ” సలార్ ” పూర్తి అయిన తరువాత ఎన్టీఆర్ మూవీపై ఫోకస్ చేయనున్నాడు.

అయితే ఎన్టీఆర్ తో చేయబోయే మూవీకి సంబంధించి ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఓ వార్తా విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరో మాత్రమే కాకుండా విలన్ గా కూడా చేయబోతున్నాడట. అంటే డ్యూయల్ రోల్ లో ఎన్టీఆర్ మెరవబోతున్నాడని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. అంతే కాకుండా ఈ మూవికి సంబంధించి ఆ మద్య ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన పోస్టర్ కూడా విలన్ రోల్ కు సంబంధించినదేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలపై చిత్రా యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే గతంలో కూడా ఎన్టీఆర్ ” జై వల కుశ ” మూవీలో ” జై ” పాత్రలో కాస్త నెగిటివ్ సేడ్ లో కనిపించాడు. ఆ మూవీ కి ” జై ” పాత్రనే హైలెట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ప్రశాంత్ నీల్ మూవీలో కూడా ఎన్టీఆర్ హీరో కం విలన్ గా నటిస్తే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. మరి ఈ వార్తా నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read

వీరి జోడీ.. భలే బాగు!

ఆ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ఇస్తాడా ?

సీనియర్స్ పని అయిపోయినట్లేనా ?