Saturday, April 20, 2024
- Advertisement -

జగన్ క్లాస్ తో.. ఎటూ తేల్చుకోలేని ఎమ్మేల్యేలు, మాజీ మంత్రులు ?

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ వైసీపీ జెండా ఎగరాలని, మరోసారి ప్రభుత్వం చేపట్టాలని వైఎస్ జగన్ ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. దాంతో వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని, గత కొన్ని రోజులుగా వైసీపీ శ్రేణులకు, ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వంపై ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ” గడప గడపకు మన ప్రభుత్వం ” అనే కార్యక్రమాన్ని చేపట్టి అందరూ కూడా గ్రామస్థాయిలో నిత్యం ప్రజల్లో ఉండాలని జగన్ సూచించారు. అయితే ఈ కార్యక్రమాన్ని కొందరు వైసీపీ ఎమ్మేల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు లైట్ తీసుకున్నారు. దాంతో తాజాగా ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలపై జగన్ సీరియస్ అయ్యారట. దాదాపుగా 27 మందిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. పనితీరు మెరుగుపరుచుకోవాలని జగన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారిలో బుగ్గన రాజేంద్రనాథ్, తానేటి వనిత, ఆర్కే రోజా కూడా ఉన్నారట.

ఇక మాజీ మంత్రులు కొడాలి నాని, పెర్ని నాని కూడా జగన్ నుంచి వార్నింగ్ ఎదుర్కొన్నారట. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నందుకే వీరందరికి వార్నింగ్ ఇచ్చారట జగన్. అయితే ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళిన వైసీపీ శ్రేణులకు ఘోర పరాభవమే ఎదురవుతోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను స్పష్టంగా నేతలపై చూపిస్తున్నారు ప్రజలు. ఇప్పటికే అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ వంటి వారు కూడా ప్రజల నుంచి చీవాట్లు ఎదుర్కొన్నా సంగతి అందరికీ తెలిసిందే. దాంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనుకునే నేతలుకు ప్రజల నుంచి ఎలాంటి పరాభవం ఎదురవుతుందోనని చాలా మంది వైసీపీ నేతలు వెనుకడుగు వేస్తున్నారు. మరో వైపు అధినేత కచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాలని అధెశాలు జారీ చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పంథాలో సాగుతోంది. ఏది ఏమైనప్పటికి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా వైసీపీ నేతలు ఎటూ తెలుచుకోలేని పరిస్థితిలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -