Saturday, April 20, 2024
- Advertisement -

వారసులకు జగన్ నో ఎంట్రీ.. మరో వైపు బాబు గ్రాండ్ వెల్కం ?

- Advertisement -

ఏపీలో ప్రస్తుతం వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ, టిడిపి పార్టీలు ప్రణాళికలు వేస్తున్నాయి. ఒకవైపు జగన్ 175 స్థానాల్లో విజయం కోసం ఉవ్విళ్లూరుతుంటే.. మరోవైపు చంద్రబాబు ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టేందుకు అస్త్రశాస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీలను క్షేత్ర స్థాయిలో బలంగా ఉంచుకునేందుకు ఇరు పార్టీల అధినేతలు విశ్వ ప్రయత్నలే చేస్తున్నారు. అయితే ఈ సారి ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్నుకునే నాయకుల విషయంలో అటు జగన్, ఇటు చంద్రబాబు వ్యతిరేక ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో యువకులకు అధిక ప్రదాన్యం కల్పించబోతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ కూడా పలుమార్లు స్పష్టం చేశారు.

దీంతో టీడీపీలోని చాలా మంది సీనియర్ నేతలు వారి వారసులను బరిలో దింపేందుకు సిద్దమయ్యారు. ఎందుకంటే టీడీపీకి యూత్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఫాలోయింగ్ లేదు. దాంతో ఆ వెలితిని భర్తీ చేసుకునేందుకు ఈ సారి ఎన్నికల బరిలో యువకులకు అధిక ప్రదాన్యం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు జగన్ మాత్రం సీనియర్ల జపం చేస్తున్నారు. యువకులకు అవకాశం కల్పించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో పెర్ని నాని వచ్చే ఎన్నికల్లో ఆయన తనయుడిని బరిలో దింపాలని జగన్ను కోరగా జగన్ తిరస్కరించారట. వచ్చే ఎన్నికల్లో కూడా సీనియర్లు తనతో పాటే ఉండాలని జగన్ సూచించినట్లు సమాచారం. దాంతో ఈ ఎన్నికల్లో తమ వారసులను బరిలో దింపాలని భావించిన చాలా మంది వైసీపీ నేతలు వారి అభిప్రాయాలను మార్చుకుంటున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read

పాపం వైసీపీ నేతల పరిస్థితి.. !

ఎన్టీఆర్ పేరు మార్పు.. బీజేపీకి ఆత్రం ఎందుకు ?

లోకేశ్ పాదయాత్ర.. జగన్ తో పోలికా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -