Friday, April 26, 2024
- Advertisement -

సీనియర్స్ పని అయిపోయినట్లేనా ?

- Advertisement -

టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లను సినీ ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలుగా అభివర్ణిస్తూ ఉంటారు. ఒకప్పుడు వీరి నుంచి సినిమాలు వస్తున్నాయంటే తెలుగు సినీ ప్రేక్షకులు పండగ చేసుకునే వారు.. ఇక వీరి అభిమానులైతే పూనకాలతో ఊగిపోయేవారు. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. ఇండస్ట్రీలో ప్రస్తుతం పవన్, మహేశ్, తారక్, ప్రభాస్, చరణ్, బన్నీ వంటి హీరోలదే హవా. వీరు మాత్రమే ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే సీనియర్ హీరోలుగా చిరు, బాలయ్య, నాగ్, వెంకటేష్ టాప్ హీరోలుగా ఉన్నప్పటికి.. నేటి తరం ఆ ఆరుగురి హీరోలతో పోటీ పడలేకపోతున్నారు.

దానికి తోడు ఈ మద్య కాలంలో సీనియర్ హీరోలకు సరైన హిట్స్ కూడా లేకపోవడంతో వారి క్రేజ్ తగ్గుతోంది అనే వాదన ఈ మద్యకాలంలో బాగా వినిపిస్తోంది. చిరు రీఎంట్రీ ఇచ్చిన ” ఖైదీ నెంబర్ 150 ” తో సూపర్ హిట్ కొట్టినప్పటికి.. ఆ తరువాత వచ్చిన సైరా నరసింహారెడ్డి, ఆచార్య వంటి సినిమాలు నిరాశ పరిచాయి. ప్రస్తుతం చిరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికి ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయనేది ప్రశ్నార్థకమే.. ఇక నాగార్జున విషయానికొస్తే.. నాగ్ సోలో హిట్ కొట్టి చాలా రోజులే అయిపోయింది. ” సోగ్గాడే చిన్ని నాయన ” తరువాత ఆ స్థాయిలో విజయం సాధించిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఈ ఏడాది వచ్చిన ” బంగార్రాజు ” కూడా యావరేజ్ హిట్ గానే నిలిచింది.

ఇక విక్టరీ వెంకటేష్ సోలో మూవీస్ చేయడం చాలావరకు తగ్గించడానే చెప్పాలి. ఈ మద్య కాలంలో ” నారప్ప “, దృశ్యం 2 ” వంటి సినిమాలతో వెంకీ సోలో గా వచ్చినప్పటికీ.. ఆ మూవీస్ ఓటిటీకి మాత్రమే పరిమితం అయ్యాయి. ఇక వరుణ్ తేజ్ తో నటించైనా ” ఎఫ్ 3 ” కూడా ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. ఇక నాటసింహ నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే.. ప్రస్తుతం బాలయ్య ఒక్కడే సీనియర్ హీరోలలో ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరో అని చెప్పాలి. దీనికి మంచి ఉదాహరణ ” అఖండ ” విజయం. ఈ మూవీతో బాలయ్య క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదని నిరూపితం అయింది. మరి ఈ సీనియర్ హీరోలు రాబోయే సినిమాలతోనైనా బాక్స్ ఆఫీస్ షేక్ చేసే విజయాలు సొంతం చేసుకుంటారో లేదో చూడాలి.

Also Read

పుష్ప2 లో మెయిన్ విలన్ ” షెకావత్ ” కాదా ?

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మహేష్.. మొదటిసారి ఉరమాస్ లుక్ ?

మెగాస్టార్ మూవీలో విలన్ అతడే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -