Friday, May 10, 2024
- Advertisement -

తమిళ స్టార్ హీరో తో స్టార్ హీరో భార్య రొమాన్స్!

- Advertisement -
star hero wife romance with other star hero

కోలీవుడ్‌ స్టార్‌ హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్‌ మీడియాలో ఫైట్‌ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కోలీవుడ్‌ స్టార్‌ హీరోలు అయిన సూర్య మరియు విజయ్‌ల అభిమానుల ఈ సోషల్‌ మీడియాలో ఫైట్‌ మరి ఎక్కువ. అయితే ఆ ఇద్దరు హీరోలు మాత్రం ఫ్రెండ్లీగా ఉంటారు. తాజాగా ఆ విషయం మరోసారి రుజువు అయ్యింది. కోలీవుడ్‌ సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సూర్య భార్య అయిన జ్యోతిక మరో స్టార్‌ హీరో అయిన విజయ్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతుంది.

విజయ్‌ కొత్త సినిమా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సినిమాలో ఇప్పటికే హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేయడం జరిగింది. ఇక మరో హీరోయిన్‌గా జ్యోతికను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన ‘ఖుషి’ సినిమాని తమిళ వర్షన్‌లో దాదాపు 15 సంవత్సరాల క్రితం విజయ్‌, జ్యోతికలు కలిసి నటించారు.

మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరు కలిసి నటించబోతున్నారు. హీరోయిన్‌ అనగానే గ్లామర్‌గా కాకుండా పద్దతిగానే జ్యోతిగా ఆ సినిమాలో కనిపించనుందని కూడా తమిళ సినీ వర్గాల వారు చెబుతున్నారు. మొత్తానికి ఒక స్టార్‌ హీరో భార్య మరో స్టార్‌ హీరోతో రొమాన్స్‌ చేయబోతుందని వినడం కాస్త కొత్తగా అనిపించినా కూడా ఇది మంచి పరిణామం అని, హీరోల ఇలాంటి వాతావరణం నడవాలని తమిళ ఆడియన్స్‌ కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది చివరల్లో విజయ్‌, జ్యోతికల కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.

Related

  1. దర్శకుడు ఎక్కడబడితే అక్కడ తాకుతాడు.. లైవ్ లో నిజాలు బయట పెట్టిన హీరోయిన్!
  2. ఆ స్టార్ హీరో సమంతను సెక్సువ‌ల్‌గా ఇబ్బందిపెట్టాడు!
  3. హీరోయిన్ ఫోన్ లో అలాంటి వీడియోలా..?
  4. హీరోయిన్ ను ఇబ్బంది పెడుతున్న రామ్ చరణ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -