Saturday, April 20, 2024
- Advertisement -

కాజల్ ఎక్కడ సర్జరీ చేయించుకుంటుందో తెలుసా..?

- Advertisement -
kajal agarwal to undergo a surgery to look more young

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో అడుగు పెట్టి.. చాలా కాలం అవుతుంది. ఇన్నేళ్లు ఒక స్టార్ హీరోయిన్ గా ఉంటున్న ఆమె.. ఈతరం స్టార్ హీరోలందరితో నటించడం, మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా ఓ సినిమా చేయడం, సమంత, రకుల్ ప్రీత్, రాశి ఖన్నా, పూజ హెగ్డే లాంటి అందాలను తట్టుకొని ఇంకా ఛాన్సులు దక్కించుకోవడం నిజంగా పెద్ద విషయమే.

గత ఏడాది మహేష్, పవన్ లతో సినిమాలు చేసిన ఈ భామ.. ఈ ఏడాది తమిళంలో అదే రేంజి హీరోలు విజయ్, అజిత్ లతో సినిమాలు చేస్తోంది. అది మరి కాజల్ మ్యాజిక్ అంటే.. అయితే ఇప్పుడు కాజల్ ఆ డోసును మరింతగా పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సర్జరీ చేయించుకొని.. తన అందాలను మరింత చూపించాలనుకుంటుంది. ఇప్పుడొస్తున్న కొత్త హీరోయిన్ల స్పీడు చూస్తోంటే కాజల్ హవా త్వరలోనే తగ్గేలా కనిపిస్తోంది. తనకన్న లేటుగా వచ్చిన హీరోయిన్స్.. తనకన్న ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇటివలే వచ్చిన పూజ హెగ్డేనే కోటిన్నర తీసుకుంటోంది. అందుకే ఇలాంటి వారి స్పీడు తట్టుకునేందుకే కాజల్ మళ్ళీ సర్జరీ చేయించుకోనుందట. ఇప్పటికే తన ముక్కుకి కాజల్ సర్జరీ చేయించుకుందని టాక్. బరువు తగ్గి, నడుము అందాలను ఇంకాస్త సన్నగా మార్చుకున్న కాజల్.. ముఖానికి మరొక సర్జరీ చేయించుకోనుందని.. ఇప్పుడు ఫిలింనగర్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

ఎప్పుడు ఒకెలా ఉంటే ప్రేక్షకులకి బోర్ కొడతానని, ఇప్పటికే దశాబ్దకాలంగా తనని చూస్తున్నారని, కొంచెం లుక్ మార్చితే ఫ్రెష్ ఫీల్ వస్తుందని కాజల్ అనుకుంటుందట. మరి ఆ సర్జరీ ఎదో బాగా జరిగితే మంచిదే కానీ  కత్రీనా కైఫ్ కి తేడా కొట్టినట్టు తేడా కొడితే తర్వాత బాధపడాల్సిందే. ఇక కాజల్ సినిమాల గురించి చూస్తే.. ప్రస్తుతం తమిళంలో మేర్సల్, వివేగం సినిమాలు చేస్తుండగా.. తేజ దర్శకత్వంలో రానాతో “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో చేస్తోంది. అలానే కళ్యాణ్ రామ్ తో ఎమ్మెల్యే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. 

{youtube}xhBGPQefkZM{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. కేవలం ఎన్టీఆర్ తో మాత్రమే.. అంటున్న కాజల్
  2. కాజల్ ప్రెగ్నెంట్.. రానా ఏం చేశాడు..?
  3. అయ్యో.. కాజల్ కెరీర్ కి సమస్యలు వచ్చాయా..?
  4. హీరోయిన్ చాన్స్ కోసం కాజల్ ఎలాంటి పనులు చేసిందో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -