Tuesday, April 30, 2024
- Advertisement -

T20 WORLDCUP : కోహ్లీ రిటైర్మెంట్ కు సమయం వచ్చిందా ?

- Advertisement -

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేందుకు సిద్దమౌతున్నారా ? కోహ్లీకి ఈ టి20 వరల్డ్ కప్ చివరిది కానుందా ? అంటే అవుననే వార్తలు క్రీడా విభాగాల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. చాలా తక్కువ సమయంలో ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకరిగా ఎదిగాడు విరాట్ కోహ్లీ. ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఇతర జట్లలో కూడా కోహ్లీకి అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. భారత్ సాధించిన ఎన్నో విజయలలో కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఎప్పటికీ ప్రత్యేకమే.. అందుకే అభిమానులు కోహ్లీ ” రన్ మిషన్ ” గా అభివర్ణిస్తూ ఉంటారు.

మరి అంతటి నాణ్యమైన ఆటగాడు గత మూడేళ్ళ కాలంలో ఎన్నో విమర్శలను మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా కోహ్లీ కెప్టెన్ గా భాద్యతలు చేపట్టిన తరువాత తన బ్యాటింగ్ లో మునుపటి పస తగ్గుతూ వచ్చింది. ఇక గత టి20 వరల్డ్ కప్ లో ఘోర పరాభవం తరువాత టి20 కెప్టెన్సీ భాద్యతలకు గుడ్ బై చెప్పడంతో ఆ తరువాత బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించింది. దాంతో బీసీసీఐ వ్యవహరించిన తీరుపై కోహ్లీ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక అప్పటినుంచి కోహ్లీ పూర్తిగా తన ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎర్కొన్నాడు. ఒకప్పుడు కోహ్లీ బ్యాటింగ్ ను ఆకాశానికెత్తిన మాజీలే.. తాన ఫామ్ లేమిని చూసి కోహ్లీ రిటైర్ అవ్వాలని బహిరంగ డిమాండ్లు చేశారు.

ఇక అప్పటి నుంచి కోహ్లీ రిటైర్మెంట్ అడపాదడపా ప్రస్తావనకు వస్తూనే ఉంది. ఎన్నో విమర్శలకు చెక్ పెడుతూ దాదాపుగా మూడేళ్ళ తరువాత ఇటీవల జరిగిన ఆసియా కప్ లో కోహ్లీ సత్తా చాటాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో మునుపటి కొహ్లీని మళ్ళీ పరిచయం చేశాడు. అయినప్పటికి కూడా కోహ్లీలో మునుపటి బ్యాటింగ్ అగ్రెసివ్ నెస్ లేదనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్నా టి20 వరల్డ్ కప్ లో కోహ్లీ ప్రదర్శనపైనే అందరి చూపు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ టి20 వరల్డ్ కప్ తరువాత కోహ్లీ టి20లకు గుడ్ బై చెబుతాడనే వాదన గట్టిగా వినిపిస్తోంది. టి20 లకు గుడ్ బై చెప్పి వన్డే, టెస్టులలో కొనసాగాలని కోహ్లీ చూస్తున్నాడట.

ఇవి కూడా చదవండి

సూర్య చాలా డేంజర్.. జాగ్రత్త గురూ !

సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. సచిన్ క్లారిటీ ?

హర్ధిక్ పాండ్య దూరం అయితే.. కప్పు కొట్టడం కష్టమేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -