Thursday, March 28, 2024
- Advertisement -

కేజీఎఫ్​ -2 ఫ్యాన్స్​కు బ్యాడ్​ న్యూస్​..!

- Advertisement -

కేజీఎఫ్​ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మాస్​ ప్రేక్షకులను ఈ మూవీ ఉర్రూతలూగించింది. ఇక ఈ చిత్రంలో హీరోగా నటించిన యశ్​, డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​ పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పనిచేసేందుకు అగ్రహీరోలు క్యూ కట్టారు. ఇక కేజీఎఫ్​ చిత్రంలోని ప్రతి పాత్ర ఓ సంచలనమే. ఈ మూవీ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. కన్నడ చిత్రమైన కేజీఎఫ్​.. పాన్​ఇండియా లెవెల్​లో ఓ ఊపు ఊపింది.

అయితే కేజీఎఫ్​ సంచలన విజయం సాధించడంతో.. కేజీఎఫ్​ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్​ భారీ వ్యూస్​ సాధించి రికార్డులు నెలకొల్పింది. ఇక ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుందోనని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్​ 9న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ నిర్మాతలు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Also Read: పవన్​ కల్యాణ్​, రానా దగ్గుపాటి సినిమా టైటిల్​ ఇదేనా?

ప్రస్తుతం కరోనా కేసులు ఇంకా పూర్తిస్థాయిలో తగ్గకపోవడం, మూడో వేవ్​ భయంతో చాలా మంది థియేటర్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. దీంతో పెద్ద సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు జంకుతున్నారు. ఈ క్రమంలో కేజీఎఫ్​ నిర్మాతలు కూడా కాస్త లేట్​గానే విడుదల చేయాలని భావిస్తున్నారు. క్రిస్మస్​ కానుకగా డిసెంబర్​ లేదా జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని వారు భావిస్తున్నారట. దీంతో కేజీఎఫ్​ ఫ్యాన్స్​ తీవ్ర నిరాశ చెందుతున్నారట.

Also Read: చిన్నోడు, పెద్దోడు.. వీళ్ల అసలు పేర్లు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -