Friday, April 19, 2024
- Advertisement -

AP Curfew : ఏపీలో ఆంక్షలు సడలింపు.. !

- Advertisement -

రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంకా కొన్ని జిల్లాల్లో కరోనా పాజిటివిటి రేటు ఎక్కువగా ఉండటంతో అక్కడ ఆంక్షలు కొనసాగిస్తున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కరోనా ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో అక్కడ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలను సడలించారు.మిగతా సమయాల్లో కర్ఫ్యూ కొనసాగుతుంది.

ఇక మిగిలిన అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జల్లాలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలను సడలించారు. దుకాణాలు మాత్రం 9 గంటలకు మూసేయాలని ప్రభుత్వం సూచించింది. అంటే ఈ జిల్లాల్లో ఇక కరోనా ఆంక్షలు పెద్దగా అమల్లో లేనట్టే.

Also Read: ఆల్ఫా, డేల్టా వేరియంట్​ ఏదైనా.. కోవాగ్జిన్‌ అ సూపర్​..!

కొత్త రూల్స్​ జూలై 7 నుంచి అమల్లోకి రానున్నాయి. అంతేకాక జిమ్​లు, కల్యాణమండపాలు సైతం తెరుచుకొనేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని సూచించింది. ఇక అన్ని ప్రాంతాల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని అధికారులు పేర్కొన్నారు. ఇక ఏపీలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు రోజువారి కేసుల సైతం అదుపులోకి వచ్చాయి. అయితే థర్డ్​వేవ్​ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: కరోనాతో మెదడు కణజాలంపై ప్రభావం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -