Friday, April 26, 2024
- Advertisement -

Krithi Shetty: టాప్ గేర్ లో దూసుకెళ్తున్న కృతి శెట్టికి బాలీవుడ్ ఆఫర్..!

- Advertisement -

ఉప్పెన సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఒక్క సినిమాతోనే వీరిద్దరూ పాపులర్ అయిపోయారు. వాళ్లిద్దరికీ ఆఫర్లు వరుస కడుతున్నాయి. కృతి శెట్టి అయితే వరుసగా అగ్రహీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే కృతి శెట్టి నాని సరసన శ్యామ్ సింగరాయ్ లో నటిస్తోంది. అలాగే సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో, యువ హీరో రామ్ పోతినేని లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బైలింగ్యువల్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

నితిన్ హీరోగా కొత్త డైరెక్టర్ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కూడా హీరోయిన్ గా కృతి శెట్టి ఛాన్స్ దక్కించుకుంది. టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కళ్యాణ్ సరసన కూడా కృతి శెట్టి నటించే అవకాశం ఉందని టాక్. పవన్ తన 28వ సినిమా గా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉండగా, ఒక హీరోయిన్ గా శృతి శెట్టి ఎంపికైనట్లు తెలుస్తోంది.

ఇప్పటికే టాలీవుడ్లో చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న కృతి శెట్టి తాజాగా బాలీవుడ్లో కూడా ఓ ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం. త్వరలో కృతి శెట్టి బాలీవుడ్ లో అడుగు పెట్టే మూవీపై అఫీషియల్ గా ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో బేబమ్మగా గుర్తింపు పొందిన కృతి శెట్టి బాలీవుడ్ లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

Also Read

తెరపైకి వచ్చే మొదటి సినిమా నాగ చైతన్యదే..!

మెగా హీరోకు నాగ్ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్..!

మా ఎన్నికలు: ప్రకాష్ రాజ్​ కు గట్టిగా బదులిచ్చిన నరేశ్​..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -