మెగా హీరోకు నాగ్ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్..!

- Advertisement -

ఉప్పెన సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.వంద కోట్ల గ్రాస్ వసూలు చేసి అబ్బురపరిచింది. ఒక డెబ్యూ హీరో మూవీ రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఇదే మొదటిసారి. తన తొలి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో వైష్ణవ్ తేజ్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మాణంలో ఓ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాకు పృథ్వీ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం పై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.

కాగా ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించేందుకు నాగార్జున ఏకంగా రూ. 5 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఓ కొత్త హీరో తన రెండో సినిమాకే ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం. కాగా ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో వైష్ణవ్ తేజ్ హాకీ ఆటగాడు గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Also Read

‘పుష్ప’ ఆఖరి షెడ్యూల్​ ప్రారంభం..!

మెగా చిన్నోడికి మరో బంపర్​ ఆఫర్​..!

ఎవరూ ఊహించని రేంజ్​లో గని డిజిటల్​ మార్కెట్​

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -