Tuesday, April 16, 2024
- Advertisement -

Thimmarusu: సత్యదేవ్​ సినిమా ఈ సారి ఓటీటీలో కాదు.. డైరెక్ట్​గా థియేటర్​లోనే..!

- Advertisement -

ఎటువంటి బ్యాక్​గ్రౌండ్​ లేకుండా ఇండస్ట్రీకి పరిచయమైన సత్యదేవ్​ అనతి కాలంలోనే మంచి నటుడిగా ప్రూవ్​ చేసుకున్న విషయం తెలిసిందే. కెరీర్​ మొదట్లో చిన్న చిన్న వేషాలు వేసిన సత్యదేవ్​.. ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంలో సత్యదేవ్​ హీరోగా నటించాడు. ఓటీటీలో విడుదలైన ఈ మూవీ సత్యదేవ్​కు ఎంతో పేరుతీసుకొచ్చింది.

ఆ తర్వాత తిమ్మరసు అనే చిత్రంలో సత్యదేవ్​ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సత్యదేవ్​ ఓ లాయర్​గా నటిస్తున్నాడు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీ మంచి సినిమాగా పేరు తెచ్చుకోవడంతో తిమ్మరసుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది.. కానీ కరోనా ఎఫెక్ట్​తో విడుదల ఆగిపోయింది. తాజాగా ఈ మూవీ విడుదలపై చిత్ర నిర్మాతలు ఓ ప్రకటన చేశారు. జులై 30న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. నిర్మాత మహేశ్‌ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించాడు.

ఈ సినిమాపై సత్యదేవ్​ మాట్లాడుతూ.. ’ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం తర్వాత మరో విభిన్న పాత్రలో నటించాలని భావించాను. సరిగ్గా అదే టైంలో తిమ్మరసు కథ నా దగ్గరకు రావడంతో వెంటనే ఓకే చెప్పా. ప్రియాంక జువాల్కర్‌ వండర్‌ఫుల్‌ కోస్టార్‌. సినిమాను జులై 30న థియేటర్లలో విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు.

అయితే ప్రస్తుతం సినీ నిర్మాతలకు , ఎగ్జిబిటర్లకు మధ్య వివాదం నడుస్తోంది. సినిమాలన్నీ ఓటీటీలో విడుదల చేయడం పట్ల థియేటర్​ యజమానులు కోపంగా ఉన్నారు. ఈ క్రమంలో థియేటర్లు ఇప్పట్లో తెరుచుకొనే పరిస్థితి లేదు. అయితే జూలై 30న తమ మూవీ విడుదల చేయబోతున్నామంటూ తిమ్మరసు నిర్మాత ప్రకటించారు. అప్పటివరకు థియేటర్లు ఓపెన్​ అవుతాయో? లేదా? అని వేచి చూడాలి.

Also Read

టాప్ గేర్ లో దూసుకెళ్తున్న కృతి శెట్టికి బాలీవుడ్ ఆఫర్..!

లాల్ సింగ్ సెట్స్ లో చైతూ..!

బిగ్ బాస్​ హోస్ట్​గా చేసేందుకు నో చెప్పిన రానా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -