Saturday, May 3, 2025
- Advertisement -

వివాదంలో యష్ టాక్సిక్!

- Advertisement -

కె.జి.య‌ఫ్‌తో సెన్సేషన్ సృష్టించిన హీరో రాక్ స్టార్ య‌ష్ . తాజాగా మరో పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నీ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అయితే తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. కర్ణాటకలో అక్రమంగా చెట్ల నరికివేతకు సంబంధించి ఆరోపణలు రావడంతో ‘టాక్సిక్’ చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటుంది. అటవీ భూమిలో అక్రమంగా చెట్ల నరికివేతకు కర్నాటక అటవీ శాఖ నిర్మాతలపై కేసు నమోదు చేయడంతో న్యాయపరమైన చిక్కుల్లో పడింది.

సినిమా సెట్ నిర్మాణం కోసం బెంగళూరులో చట్టవిరుద్ధంగా చెట్లను నరికివేయగా దీనిని కర్ణాటక పర్యావరణ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తీవ్రంగా ఖండించారు. వందలాది చెట్లు నేలకూలాయని శాటిలైట్ చిత్రాల ద్వారా ధృవీకరించగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

యష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా KVN ప్రొడక్షన్స్ మరియు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తోన్నారు. 2025లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -