- Advertisement -

బడ్జెట్ అంతా ఆర్గనైజ్‌డ్ క్రైమ్!

- Advertisement -

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వైఎస్ జగన్ విమర్శలు కురిపించారు. కూటమి సర్కార్‌ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్‌ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌హన్‌రెడ్డి నిలదీశారు.

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు మాజీ సీఎం వైఎస్ జగన్. కూటమి సర్కార్‌ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్‌ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ మండిపడ్డారు.

చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తాడు… ఆ అబద్ధాన్ని ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తాడు.. తర్వాత తన మనుషులతో పదేపదే అబద్ధాలు చెప్పిస్తాడు ఇది అలవాటైన పనే అన్నారు. అప్పుల విషయంలో ఏపీ శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేశారు.ఇవే విషయాలను దత్త పుత్రుడితో మాట్లాడిస్తారు… ఇదంతా ఆర్గ్‌నైజ్డ్‌ క్రైమ్‌కు నిలువెత్తు ఆధారం అని చెప్పారు.

సూపర్‌ సిక్స్ హమీలను ఎగ్గొట్టేందుకు బాబు దుష్ప్రచారం చేశారు. 2018-19 నాటికి రూ.3 లక్షల 13 వేల కోట్ల అప్పు…మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 6 లక్షల 46 వేల కోట్లు అప్పు. రూ.14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -