Sunday, April 28, 2024
- Advertisement -

పుష్పా2 లో విలన్ గా స్టార్ హీరోయిన్?

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప2. క్రియేటివ్ . దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేయడంతో రెండవ భాగంపై విమరితమైన బజ్ ఏర్పడింది. దాంతో ఎక్కడ కంప్రమైజ్ కాకుండా మూవీని రూపొందిస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే లీక్ అవుతున్న కొన్ని వార్తలు మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. మొదటి భాగంలో విలన్ గా పరిచయం అయిన ఫహద్ ఫజిల్ రెండవ భాగంలో నిడివి మరింత ఎక్కువగా ఉండడంతో అల్లు అర్జున్, ఫహద్ మద్య సీన్స్ ఎలా ఉండబోతున్నాయో అన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఇక ఈ సినిమాలో మరో విలన్ క్యారెక్టర్ కు కూడా స్కోప్ ఉందట.

ఆ క్యారెక్టర్ కోసం ఇప్పటికే విజయ్ సేతుపతి పేరు, అలాగే బాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే వాటిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరో ఇబ్బంది పెట్టె ఓ లేడి విలన్ రోల్ కూడా ఉందట. ఆ పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సరైనోడు మూవీలో అల్లు అర్జున్ కు జోడీగా నటించిన కేథరిన్ థెరిస్సా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

సరైనోడు మూవీలో ఎమ్మెల్యే కారెక్టర్ లో కేథరిన్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక “ఒక రాజు ఒక మంత్రి” మూవీలో కూడా లేడి విలన్ గా గుర్తింపు పొందింది కేథరిన్. దాంతో పుష్ప 2 లో కూడా హీరోను ఇబ్బంది పెట్టె పాత్ర ఒకటి ఉండడంతో చిత్రయూనిట్ ఆమె సంప్రదింపులు జరుపుతునంటూ సమాచారం. మరి ఒకవేళ ఇదే గనుక నిజం అయితే అల్లు అర్జున్ మరియు కేథరిన్ మద్య వచ్చే సీన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

మహేశ్ స్టోరీ అదే.. జక్కన క్లారిటీ !

ఆదిపురుష్ కు సవాల్ గా మారిన హనుమాన్!

“ప్రాజెక్ట్ కే” మామూలుగా ఉండదట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -