Saturday, May 4, 2024
- Advertisement -

పవన్ ప్లాన్ అదుర్స్.. అక్కడే స్పెషల్ ఫోకస్?

- Advertisement -

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు భాలభాగం ఉత్తరాంధ్ర చుట్టూ తిరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలను బలంగా ఆకర్షిస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని ఏపీలో ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే వైసీపీ, టిడిపి, జనసేన పార్టీలు ప్రస్తుతం ఉత్తరాంధ్రపైనే స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా వైసీపీ ఆ విషయంలో కాస్త ముందుందనే చెప్పాలి. విశాఖను పరిపాలన రాజధానిగా చేసి అక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తే..ఆ ప్రాంత ప్రజల దృష్టి వైసీపీ వైపు మల్లె అవకాశం ఎక్కువగా ఉందని భావించి.. విశాఖనే రాజధాని అనే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు వైసీపీ నేతలు. అంతే కాకుండా విశాఖ రాజధానికి మద్దతుగా ఏకంగా ప్రభుత్వ పార్టీనే ఒక్క అడుగు ముందుకేసి ” విశాఖ గర్జన ” అంటూ ఉద్యమ బాటా పట్టిందంటే.. ఉత్తరాంధ్ర పై జగన్ ఏ స్థాయిలో దృష్టి కేంద్రీకరించారో అర్థం చేసుకోవచ్చు.

ఇక మూడు జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్రను ఆరు జిల్లాలుగా విడిగొట్టిన జగన్ సర్కార్ కు ప్రజా మద్దతు పెరిగే అవకాశం ఉందని భావించినప్పటికి రియాలిటిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఉత్తరాంధ్రలో టీడీపీ కూడా ఆశించిన స్థాయిలో యాక్టివ్ గా లేదు. దీంతో ప్రస్తుత పరిస్థితికి క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆ మద్య విశాఖ కేంద్రంగా చోటు చేసుకున్నా రాజకీయ పరిణామాలు జనసేనకు మంచి మైలేజ్ తీసుకొచ్చాయి. దాంతో మరోసారి ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్దమయ్యారు పవన్. ఈ పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రజల దృష్టి జనసేన వైపు మరాల్చగలిగితే.. జనసేనకు తిరుగుండదని భావిస్తున్నారు పవన్.

అందుకే మరోసారి ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్దమయ్యారు పవన్. ముందుగా పార్టీ సమన్వయ కర్త నాదెండ్ల మనోహర్ ఉత్తరాంధ్రలో పర్యటించి పార్టీ స్థితిగతులను పర్యవేక్షించే పనిలో ఉన్నారు. ఉత్తరాంధ్రలో అధికంగా ఉన్న కాపులు, తూర్పు కాపుల మద్దతు ఎలాగూ పవన్ కే ఉంటుందని, ఇక బీసీ సామాజిక వర్గాన్ని ఆకర్షించగలిగితే ఇక్కడ జనసేనకు తిరుగుండదని పవన్ ఆలోచిస్తున్నారట. అందుకే ఈసారి ఉత్తరాంధ్ర పర్యటనలో మేజర్ గా బీసీలపైనే దృష్టి పెట్టె అవకాశం ఉందని కొందరి అంచనా. మరి ఈసారి ఉత్తరాంధ్ర కేంద్రంగా పవన్ ఎలా ముందుకు వెళతారు ? ప్రభుత్వాన్ని ఎలా డిఫెన్స్ చేస్తారు ? అసలు పవన్ వ్యూహాలు ఎలా ఉత్నబోతున్నాయి అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి చూడాలి పవన్ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది.

ఇవి కూడా చదవండి

ఎమ్మేల్యేలు.. జర భద్రం !

బాబు సెంటిమెంట్ అస్త్రం.. కొంపముంచుతోందా ?

ఈసారి డౌటే.. మోడీకి షాక్ తప్పదా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -