Thursday, March 28, 2024
- Advertisement -

సర్కార్ వారి పాట కు ఓ చిన్న బ్రేక్..!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ తో సూపర్ హిట్ కొట్టి సంక్రాంతి రేసులో తనకంటూ ఓ రేంజ్ ఉందని తెలియజేశాడు.. అనిల్ రావిపూడి లాంటి చిన్న డైరెక్టర్ తో ఇంత పెద్ద హీరో సినిమా చేయడం మహేష్ పెద్ద ధైర్యమే చేశాడని చెప్పాలి.. నిజానికి మహేష్ లాంటి సూపర్ స్టార్ లు పెద్ద దర్శకులతో తప్ప సినిమా చేయరు. కానీ ప్రయోగాలకు దగ్గరగా ఉండే మహేష్ ఈ సినిమా చేసి పేరు తో పాటు హిట్ కూడా దక్కించుకున్నాడు.. ఈ సినిమా తర్వాత మహేష్ నుంచి సర్కార్ వారి పాట అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే..

అయితే ఈ సినిమా ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తుంది.. మహేష్ ఈ సినిమా కంటే ముందు ఓ సినిమా చేస్తాడని ఆ తర్వాతే పరశురామ్ తో చేతులు కలుపుతాడని అంటున్నారు.. ఈమధ్య త్రివిక్రమ్ తో మహేష్ బాబు సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో మహేష్ కి ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తేనే బాగుండనిపిస్తుండట.. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ కూడా ఈ సినిమా కు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.. అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా ఒప్పుకున్నా సంగతి తెలిసిందే.. అయితే ఎన్టీఆర్ RRR షూటింగ్ లో ఉండడంతో ఆ సినిమా కాస్త పోస్ట్ పోన్ అయ్యిందని చెప్తున్నారు..

ఇక మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడని ఈ సంకేతాలు అందడంతో ‘సర్కారు వారి పాట’ షూటింగ్‍ త్వరగా మొదలు పెట్టేయడానికి మైత్రి మూవీస్‍ సన్నాహాలు చేసుకున్నారు. నవంబరులో అమెరికాలో ఒక షెడ్యూల్‍ చేద్దామని ప్లాన్‍ చేసారు. అక్కడకి లొకేషన్‍ రెక్కీ కోసం వెళ్లిన పరశురాం ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో షూటింగ్‍ అంత ఈజీ కాదని తెలుసుకున్నాడు. దీంతో షూటింగ్‍ జనవరికి వాయిదా పడింది. ఈలోగా మహేష్‍ కానీ త్రివిక్రమ్‍ సినిమా మొదలు పెట్టేస్తాడేమోననే భయం, కంగారు ‘సర్కారు’ యూనిట్లో నెలకొంది. వారి భయాన్ని మరింత పెంచుతూ త్రివిక్రమ్‍తో అతి త్వరలో సినిమా చేస్తున్నట్టు మహేష్‍ ట్వీట్‍ కూడా పెట్టేసాడు.

త్రివిక్రమ్ కి ఎందుకింత డిమాండ్..?

ఇన్ని సార్లు రీ షూట్ చేస్తే ఎలా చైతు..?

‘సర్కార్ వారి పాట’ యాక్షన్ ప్లాన్ చేంజ్.. ఎందుకు..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సునీల్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -