ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సినిమా రంగంపై బాగానే ప్రభావం చూపింది. ఇప్పటికే కంప్లీట్ అయిన సినిమాలు ఆగిపోగా.. మరికొన్ని సినిమాలు షూటింగ్ స్లోగా జరుగుతోంది. మరికొన్ని సినిమాలు విడుదల కాకుండా ఆగిపోతున్నాయి.
బయ్యర్లు సైతం కొత్త సినిమాలు కొనేందుకు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే మోడీ దెబ్బకు ఓ టాలీవుడ్ హీరో కేరీర్ కకావికలమైంది. ఆ హీరో ఎవరో కాదు అల్లరి నరేష్. అల్లరి నరేష్ కథానాయకుడిగా ‘అలా ఎలా’ తో ఆకట్టుకొన్న అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రానికి రీమేక్ ఇది. డిసెంబరు నుంచి షూటింగ్ స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయిందట. ఈ చిత్ర నిర్మాత దగ్గర వైట్ క్యాష్ లేకపోవడంతోనే ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది.
ఇక పెద్ద నోట్ల ఎఫెక్ట్‌తో అల్లరి నరేష్ నటించిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఒప్పకోవాల్సిన మరో రెండు సినిమాలు సైతం ఇదే కారణంతో ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఏదేమైనా పెద్ద నోట్ల రద్దు అల్లరి నరేష్ పై బాగా ఎఫెక్ట్ చూపించిందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అసలే నరేష్ కేరీర్ అంతంతమాత్రంగా ఉంది. వరుస ప్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ టైంలో మోడీ డెసిషన్ నరేష్ కేరీర్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది.
Related