Tuesday, May 14, 2024
- Advertisement -

బాహుబలికి కుల గజ్జి అంటించిన..మోహన్ బాబు

- Advertisement -
Mohan Babu’s personal wish for Prabhas

బాహుబలి 2 సినిమా ప్రస్తుతం భారీ కలెక్షన్లను సాధిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం దిశగా వెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ప్రశంసలు అందుతున్నాయి. మన సినీ సెలబ్రిటీలు కూడా రాజమౌళి, ప్రభాస్, రానా కష్టాన్ని మెచ్చుకుంటున్నారు. చిరు, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా అందరు తమ ప్రశంసలు తెలిపారు. వీళ్ళందరి మాటలు ఒకలా ఉంటే మోహన్ బాబు మాటలు ఇంకోలా ఉన్నాయి.

అసలు బాహుబలి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభాస్ కులం గురించి ఎందుకు మాట్లాడాల్సివచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు. బావా బాహుబలి.. పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే రాజులు పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను. ఇక్కడ మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తుందని భావిస్తున్నాను.

ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను. విజయీభవ అంటూ మోహన్ బాబు ప్రభాస్ మీద ట్వీట్స్ పెట్టారు. మొదట, అసలు ప్రభాస్ మోహన్ బాబు ఏ వరసలో బావ అవుతాడు ? రెండు, ప్రభాస్ కులాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది ? ఈ ట్విట్స్ నేషనల్ మీడియా దాకా వెళితే ఇంకేమైనా ఉందా, మళ్ళీ తెలుగు వాళ్ళు కులానికి ఇచ్చే ప్రముఖ్యత గురించి పెద్ద లెక్చర్ మొదలుపెడతారు.

{youtube}i-64lFvzUQI{/youtube}

Related

  1. పవన్ బాహుబలి.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది
  2. బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ తో ఎన్టీఆర్ కి ఏం సంబంధం..?
  3. బాహుబలి 2 తో పవన్ కి ఏం సంబంధం..? అసలు సీక్రెట్ ఇదే..
  4. బాహుబలి విలన్ అల్లు అర్జున్.. నెట్ లో హల్ చల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -